Vastu Tips ఇంటి మధ్య భాగం వాస్తు పురుషుని హృదయ స్థానం. దీనినే బ్రహ్మ స్థానం అంటారు. ఈ స్థానం వాస్తు పురుషుని నాభిగా చెబుతారు. మనం పొట్టపై ఎక్కువ బరువు పెట్టనట్లే, ఇంటి మధ్యలో కూడా ఎక్కువ బరువు పెట్టకూడదు. ఈ భాగంలో చాలా బరువైన వస్తువును ఉంచినా లేదా స్తంభం పెట్టినా ఆ భవనంలో వాస్తు దోషం ఉంటుంది.
We’re now on WhatsApp : Click to Join
గర్భం దాల్చడం సాధ్యం కాదు : ఒక భవనంలో వాస్తు దోషం కనిపించినా లేదా వాస్తు నియమాలను ఉల్లంఘించినా అక్కడ నివసించే వారు రోగాల బారిన పడతారు. కొంతమంది స్త్రీలు గర్భవతి అయితే మరికొందరు గర్భం దాల్చలేరు. మహిళలు ఎదుర్కొనే ఈ సమస్యకు వాస్తు కూడా కారణం. ఇంట్లో వాస్తు దోషం ఉన్న స్త్రీలకు తరచుగా గర్భస్రావాలు జరుగుతాయని చెబుతారు.
మధుమేహం సమస్య : వాస్తు దోషం ఉంటే ఆ ఇంటి యజమానికి కడుపునొప్పి లాంటి సమస్యలు తలెత్తె అవకాశం ఉంది. మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ. ప్యాంక్రియాస్ సమస్య, ప్యాంక్రియాస్ నుండి షుగర్ సమస్య కారణంగా కూడా వారు కాలేయ సమస్యను ఎదుర్కొంటారు.
చెట్టును నాటండి: మనం పాతకాలం నాటి ఇళ్లను చూసినట్లైతే.. ఇంటి మధ్య భాగంగాలో ఖాళీ ప్రదేశాన్ని ఉంచేవారు. కానీ.. ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లలో అంగుళం స్థలం కూడా వదలకుండా భవన నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే.. ఇలాంటి సమయంలో ఇంటి మధ్యలో తులసి చెట్టును పెట్టుకోవడం ఉత్తమమని చెబుతున్నారు వాస్తు శాస్త్రవేత్తలు.
పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి : గతంలో నిర్మించిన ఇళ్ల కేంద్రం ఖాళీగా ఉండేది. కానీ ఇప్పుడున్న ఇంటిని ఆ విధంగా నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే ఇంట్లోని ఈ భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఇంటి మధ్యలో ఎలాంటి అపరిశుభ్రత లేకుండా చూసుకోండి. ఇక్కడ మీరు భూమిపై రకరకాల రంగోలి వేయాలి లేదా దానిపై రంగోలితో టైల్స్ వేయాలి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకురావడానికి ఉత్తమమైన మార్గాలు అన్వేషించండి. ఇంట్లోకి సూర్యకిరణాలు పడే విధంగా ఏర్పాటు చేయడం ద్వారా ఇంట్లో ఉండే నెగిటివీ పోయి పాజిటివ్ వైబ్స్‌ను మీరు ఫీల్ అవుతారు కూడా.