Vasthu Tips: మీ వంటగదిలో ఈ వస్తువులు ఉన్నాయా.. అయితే మీరు సమస్యలు కోరి తెచ్చుకున్నట్టే?

సాధారణంగా ఇంటి వాస్తు ఆ ఇంట్లో ఉండే వ్యక్తులపై ప్రభావాన్ని చూపుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ

  • Written By:
  • Updated On - November 17, 2022 / 10:43 AM IST

సాధారణంగా ఇంటి వాస్తు ఆ ఇంట్లో ఉండే వ్యక్తులపై ప్రభావాన్ని చూపుతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. అందుకే ఇంటి నిర్మాణ విషయం నుంచి ఇంట్లో వస్తువులు మొక్కల విషయం వరకు వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటారు. అయితే ఇంట్లో ఉండి కొన్ని రకాల వస్తువులు ఆ మనుషుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయి. మరి ముఖ్యంగా వంటగదిలో కొన్ని రకాల వస్తువులు ఉండటంవల్ల అవి ఆ ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపుతాయి. మరి కిచెన్ లో ఎటువంటి వస్తువులు ఉండకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వంట గదిలో ఎప్పుడూ కూడా అద్దం ఉండకుండా చూసుకోవాలి.

ఈ మధ్యకాలంలో చాలామంది వంటగదిలో కూడా అద్దాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే వంట గదిలో ఎప్పుడూ కూడా చీపురును ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో తిండికి కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చీపురుని ఎవరికి కనిపించని చోట పెట్టడం మంచిది. అలాగే కొందరు వంటగదిలోని కొన్ని డబ్బాలలో మాత్రలను పెట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుంది.

అదే కాకుండా ఆ ఇంట్లో ఉండేవారు ఒక్కొక్కరుగా ఆరోగ్యం బారిన పడుతూనే ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలోను వంట గదిలో మాత్రలను పెట్టకూడదు. అలాగే వంట గదిలో ఎప్పుడు విరిగిన పాత్రను ఉంచకూడదు. విరిగిన పాత్రలు ఉంచడం వల్ల అవి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అదేవిధంగా తుప్పు పట్టిన పాత్రలను కూడా వంట గదిలో ఉంచకూడదు. పగిలిన వంట పాత్రలలో ఆహారం చేయడం తీసుకోవడం లాంటివి కూడా చేయకూడదు. అయితే కొందరు పాడైపోయిన ఆహారాన్ని కిచెన్ లో నిల్వ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ ఇంట్లో వారు పేదరికంతో బాధలు పడాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఆహారం చెడిపోతే వెంటనే పారేయాలి.