Shampoo Tips: మీ షాంపూలో ఆ 4 ఉండొద్దు.. గ్రీన్ టీ, కుంకుడుకాయల షాంపూలు బెస్ట్

ఏ షాంపూ (Shampoo) వాడాలి? ఏ షాంపూ వాడొద్దు? జుట్టుకు బలం ఇచ్చే షాంపూ ఏది? మంచి షాంపూలో ఏమేం ఉంటాయి? కెమికల్స్ లేని నేచురల్ షాంపూ తయారీ ఎలా? ఇవన్నీ తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే. మొట్టమొదట మీరు షాంపూని (Shampoo) కొనుగోలు చేసినప్పుడల్లా.. అందులో కొన్ని పదార్థాలు లేకుండా చూసుకోవాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకోండి.

సల్ఫేట్లు:

ఏదైనా షాంపూలోని అత్యంత సాధారణ పదార్ధాలలో ఒకటి. సల్ఫేట్ ప్రాథమికంగా శక్తివంతమైన డిటర్జెంట్. మనం షాంపూను తలకు రాసుకున్నప్పుడు నురుగు వచ్చేటందుకు కారణం సల్ఫేట్లు. వాటిలోని క్లీనింగ్ లక్షణాల కారణంగా అవి ఉపయోగకరంగా పరిగణించ బడుతున్నాయి. అయితే ఈ పదార్ధాన్ని అధికంగా ఉపయోగించడం వల్ల జుట్టు పొడిగా, గజిబిజిగా మారుతుంది. చిక్కుబడ్డ జుట్టు సమస్య కూడా కలుగుతుంది. ఇది చివరికి జుట్టు విచ్ఛిన్నానికి దారితీయవచ్చు.

ఆల్కహాల్:

ఈ పదార్ధానికి కొత్త పరిచయం అవసరం లేదు. అందువల్ల మీరు వాడే షాంపూలు ఆల్కహాల్ రహితంగా ఉండాలి.  ఆల్కహాల్ అనేది షాంపూలోని సల్ఫేట్‌లతో కలిపినప్పుడు మన తలకు హాని చేస్తుంది. ఫలితంగా జుట్టు పొడిగా మారి రాలిపోతుంది.

పారాబెన్స్:

షాంపూలోని పారాబెన్స్ జుట్టులోని తేమను తగ్గిస్తాయి. మీ స్కాల్ప్‌ను చికాకును కలిగిస్తాయి. జుట్టు రంగు పాలిపోయి, రాలడానికి దారితీస్తుంది.

సువాసనలు:

షాంపూలలో మంచి వాసన వచ్చేటందుకు కొన్ని కృత్రిమ కలర్ ఫ్లేవర్స్ కలుపుతారు. అయితే సున్నితమైన చర్మం ఉన్న వారి తలకు ఇవి చికాకు కలిగిస్తాయి. జుట్టు రాలడానికి కూడా దారి తీయొచ్చు.

రివర్స్ షాంపూ (Shampoo) అంటే ఏంటి?

సాధారణంగా షాంపూ చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేసుకుంటారు. అలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, చిక్కు లేకుండా ఉంటుంది. జుట్టు సహజ నూనె, తేమ చెక్కుచెదరకుండా చేస్తుంది. అయితే షాంపూ చేసుకునే ముందు కండిషనర్ పెట్టడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడాన్ని రివర్స్ షాంపూ అని కూడా అంటారు. అలా చేస్తే షాంపూలోని కఠినమైన రసాయనాలు జుట్టులోకి ప్రవేశించలేవు.

గ్రీన్ టీ హెర్బల్ షాంపూ (Green Tea Herbal Shampoo):

జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి  హెర్బల్ షాంపూని ఉపయోగించడం ముఖ్యమని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం మీరు గ్రీన్ టీ హెర్బల్ షాంపూ వినియోగించాల్సి ఉంటుంది. ఈ టీ షాంపూని వినియోగించడం వల్ల అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ హెర్బల్‌ షాంపూ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

షాంపూ (Shampoo) తయారికి కావాల్సిన పదార్థాలు ఇవీ..

  1. గ్రీన్ టీ ఆకులు (తేయాకులు)
  2. మిరియాల నూనె
  3. నిమ్మరసం
  4. కొబ్బరి నూనె
  5. తేనె
  6. యాపిల్ సైడర్ వెనిగర్

గ్రీన్ టీ షాంపూను (Green Tea Shampoo) తయారు చేసుకునే విధానం:

ముందుగా గ్రీన్ టీ ఆకులను పొడి చేసుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ టీ పొడిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి. ఇలా కలిపిన మిశ్రమాన్ని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. పెప్పర్‌మింట్ ఆయిల్‌ను కూడా అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో నిమ్మరసం, కొబ్బరి నూనె, తేనె కలిపి ఫైన్‌గా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రీన్ టీ షాంపూ ప్రయోజనాలు:

గ్రీన్ టీ షాంపూలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, జింక్ వంటి పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా జుట్టు అప్లై చేస్తే పెరుగుదలకు, జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గిస్తాయి. అంతేకాకుండా జుట్టులోని చుండ్రు సమస్యలను తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఈ షాంపూతో జుట్టుకు మసాజ్‌ చేయాల్సి ఉంటుంది.  ఇలా చేయడం వల్ల  రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా, బలంగా తయారవుతుంది.

కుంకుడుకాయలతో హోం మేడ్ షాంపూ (Shampoo):

హోం మేడ్ షాంపూను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఐదు లేదా ఆరు కుంకుడు కాయలను తీసుకుని గింజలను తొలగించి పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకొని అందులో ఒక పెద్ద శీకాయ‌, గింజ తొలగించిన కుంకుడు కాయలు, వ‌న్ టేబుల్ స్పూన్ మెంతులు, ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి మ‌రో గిన్నెను పెట్టుకుని అందులో నానబెట్టుకున్న శీకాకాయ, కుంకుడుకాయ, మెంతులను వాటర్‌తో సహా వేసుకోవాలి.అలాగే అందులో మూడు మందారం పువ్వులను కూడా వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన మిశ్రమాన్ని చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని స్ట్రైన‌ర్‌ సహాయంతో ఫిల్టర్ చేసుకుంటే. హోం మేడ్ షాంపూ సిద్ధమైనట్టే. ఈ షాంపూ ను వారంలో రెండు సార్లు వినియోగిస్తే. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.

Also Read:  Pisces: మీన రాశిలోకి గ్రహాల రాజు.. 4 రాశుల వారికి ఆర్ధిక ప్రయోజనాలు