వర్షాకాలం(Rainy Season)లో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నందున ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గాలి, వానల కారణంగా చెట్లు కూలడం, విద్యుత్తు తీగలు తెగిపోవడం వంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో విద్యుత్ షాక్‌కు గురికావడం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకే నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా తడిసిన కరెంట్ స్తంభాలను, నీటిలో నిన్నటి చెట్ల కొమ్మలను తాకకుండా ఉండటం, విద్యుత్తు తీగలు కింద మొబైల్ ఫోన్‌లో మాట్లాడకపోవడం వంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సినవే.
Nipah Virus: నిపా వైరస్ కేరళలో మళ్లీ కలకలం, రెండు కేసులు నమోదు
ఇంటి పరిధిలో కూడా విద్యుత్ ప్రమాదాలు నివారించేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. పాతవైర్లు, స్విచ్ బోర్డులు మార్చడం, ఎర్తింగ్ సరిగ్గా ఉన్నదో లేదో తనిఖీ చేయించటం తప్పనిసరి. టీవీలు, ఫ్రిడ్జిలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను గోడలకు దూరంగా, నీరు చేరని ప్రదేశాల్లో ఉంచాలి. తడి చేతులతో ఎలక్ట్రిక్ వస్తువులు తాకకుండా ఉండాలి. అలాగే వర్షం సమయంలో ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు టీవీ, మోటర్, కంప్యూటర్ లాంటి పరికరాలను స్విచ్ ఆఫ్ చేయాలి. ఇది షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని తగ్గించగలదు.
పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. చిన్నారులు ఎలక్ట్రిక్ స్విచ్‌లకు దూరంగా ఉండేలా చూడాలి. వారికి విద్యుత్ ప్రమాదాల గురించి సరైన అవగాహన కల్పించాలి. అలాగే ఉతికిన దుస్తులను ఇనుప తీగలపై ఆరవేయకూడదు. వర్షం, గాలి ఎక్కువగా ఉన్న సమయంలో విద్యుత్ తీగలు తెగిపోతే, వాటిని తాకకుండా స్థానిక విద్యుత్ అధికారికి వెంటనే సమాచారం ఇవ్వాలి. ఇంట్లో ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకు ఎర్తింగ్ ఉండేలా చూసుకోవాలి. వర్షాకాలం మానవ జీవితానికి శుభాన్ని తీసుకురావచ్చు కానీ, జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలను కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటమే మేలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.