Site icon HashtagU Telugu

Parents : పిల్లల ముందు తల్లితండ్రులు గొడవ పడుతున్నారా?

పిల్లల(Childrens) ముందు మనం ఎప్పుడూ గొడవపడుతుంటే వారికి ఇంటి వాతావరణం అంటే ఇష్టం ఉండదు. ఇంకా అలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు మానసికంగా, శారీరకంగా బలహీనపడతారు. అలాంటి పిల్లలు అందరి పిల్లల్లా నార్మల్ గా ఉండరు. అందరితో కలిసిమెలిసి ఆడుకోవడం వంటివి చేయరు. అలాంటి పిల్లలు ఎక్కువగా మూడీగా ఉంటూ ఉంటారు. అమ్మానాన్నలు ఏదయినా విషయం మీద మాట్లాడుకుంటూ మాటా మాటా పెరిగి గొడవగా మారుతుంది. కాబట్టి ఏదయినా విషయం చర్చించాలి అనుకుంటే పిల్లల ముందు కాకుండా వారు ఇంటిలో లేని టైంలో మాట్లాడుకోవాలి.

ఎప్పుడైనా నెలలో ఒకసారి పిల్లల ముందు అనుకోకుండా గొడవపడటం వేరు. కాని రోజూ ఎదో ఒక విషయమై గొడవపడితే మాత్రం పిల్లల మీద చెడు ప్రభావం పడుతుంది. వారి మైండ్ సెట్ బాగా దెబ్బతింటుంది. పిల్లలు ఇంటికి రాగానే వారితో కబుర్లు చెప్పుకుంటూ వారితో టైం స్పెండ్ చేసేవారంటే పిల్లలకు ఇష్టం ఉంటుంది. అంతేగాని విడిపోవాలా లేక కలిసిఉండాలా అని అనుకుంటూ ఉండే తల్లితండ్రులు ఉంటే పిల్లలు మాకు అమ్మానాన్నలు దూరం అవుతారేమో అనే భయం, ఆందోళనతో ఉంటారు.

ఆఫీస్ నుండి లేటుగా రావడం, పిల్లలను పట్టించుకోవట్లేదు, నేనే ఎపుడూ పిల్లలని చూస్తున్నాను అని మీరు పిల్లలతో టైం స్పెండ్ చెయ్యట్లేదు అని భార్యాభర్తలు మీద పిల్లల ముందు ఆరోపణలు చేస్తే పిల్లలు బాధ పడతారు. కాబట్టి పిల్లల మనసు తేలికగా వారు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం మన ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పిల్లలు హ్యాపీగా ఉంటారు. మనం ఇంట్లో వారి ముందు బాగుంటేనే బయట కూడా వారు అందరితో బాగుంటారు.

 

 

Exit mobile version