Tips for House Maintenance : ప్రతి ఇంటికి ప్రధాన ముఖ ద్వారం అన్నది తప్పనిసరిగా ఉంటుంది. ఈ ప్రధానద్వారం విషయంలో చాలామంది అనేక రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రధాన ద్వారం విషయంలో అనేక రకాల వాస్తు విషయాలను పాటించడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అయితే వాస్తు పట్టింపు లేనివారికి ఎలాంటి బాధాలేదు కానీ, వాస్తు పట్టింపు ఉండేవారికి మాత్రం పునాది రాయి మొదలు ఇంటి (House) నిర్మాణం. అయితే కొంతమంది ముఖద్వారానికి ఎదురుగా కొన్ని రకాల ఫోటోలు పెట్టడంతోపాటు కొన్ని రకాలు మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇంటి (House) ముఖ ద్వారానికి ఎదురుగా మరణించిన పెద్దల ఫొటోలు అమర్చరాదు.
We’re now on WhatsApp. Click to Join.
కేవలం దేవుళ్ల ఫొటోస్ మాత్రమే అమర్చాలి. వినాయకుడి ఫొటో పెడితే ఇంకామంచిది. ఇంటి గోడలు కట్టేట్టపుడు తాపీ మేస్త్రీలు, పై పనులు చేయటం కోసం సపోర్టు కర్రలు వేసే సమయంలో గోడలకు కన్నాలు వేస్తుంటారు. వాటిని అవసరం తీరిన వెంటనే ఆ కన్నాలు తప్పనిసరిగా మూసేయ్యాలి. వాయువ్యం పెరిగినా, మూతపడినా ఇంకా వాయువ్యంలో ఇంకా దోషాలేమైనా ఉంటే వాయుపుత్రుడైన హనుమంతుడిని ఆ ప్లేస్ లో ఉంచి పూజిస్తే ఆ దోషాల తీవ్రత తగ్గుతుంది. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పడమర వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం ఈ నాలుగు వైపులా వీధి పోట్లు మంచిది. తూర్పు ఆగ్నేయం,ఉత్తర వాయువ్యం,పడమర నైరుతి, దక్షిణ నైరుతి వీధి పోట్లు మంచివి కావు. బీరువాలు నైరుతి వైపు ఉంచి ఉత్తరానికి తెరిచినట్టుండాలి.
తూర్పు, ఉత్తర ప్రహరి గోడలపై పూల చెట్లు పెంచరాదు. మూడు పసుపు కొమ్ములు,పసుపు దారంతో గుమ్మానికి కడితే దృష్టిదోషం తొలగిపోతుంది. పడమట వైపు స్థలం కొనుక్కుంటే భార్యకు అనారోగ్యం, నష్టం. అలాగే ఈశాన్యంలో బరువు ఉంచరాదు. పడమర, దక్షిణం వైపు బరువులు ఉంచవచ్చు. దేవాలయాల నీడ, ధ్వజ స్థంభం నీడ పడే స్థలంలో ఇల్లు నిర్మించకూడదు. పాముల పుట్ట ఉన్న స్థలం కొనకూడదు. తక్కువ ధరకు వచ్చింది కదా అని పుట్టను తవ్వి ఇల్లు కట్టినా, ఇంట్లో నాగుపాముని చంపినా ఆ ఇంటి యజమాని కుటుంబానికి తరతరాలుగా నాగదోషం వెంటాడుతుంది.
Also Read: Driving Tips In Fog: పొగమంచులో డ్రైవ్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవే..!