Site icon HashtagU Telugu

Winter : చలికాలంలో మనం తినకూడని ఆహార పదార్థాలు ఇవే..

Dont eat These Foods in Winter must Follow for your Health

Dont eat These Foods in Winter must Follow for your Health

చలికాలం(Winter) రాగానే మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థకు(Immune system) బలం తగ్గుతుంది. మనం ఎదో ఒక ఇన్ఫెక్షన్ కు గురవుతుంటాము. అయితే మనం కొన్ని ఆహార పదార్థాలకు(Food) దూరంగా ఉండడం వలన మనం చలికాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ కాలంలో ఆస్తమా, కఫము ఉన్నవారికి ఇంకా ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది.

అయితే ఆస్తమా, కఫము ఉన్న వారు పాలు, పాల సంబంధ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పెరుగును తినాలి అనుకుంటే వేడిగా ఉన్న ఆహార పదార్థాలతో పాటుగా తినాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.

చలికాలం అంటేనే వేడి వేడిగా బజ్జీలు, పకోడీలు వంటివి తినాలి అనిపిస్తుంది. కానీ చలికాలంలో ఈ రకమైన ఆయిల్ ఫుడ్స్ తినకూడదు. వీటిని తినడం వలన అవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి.

చలికాలంలో ఆహారం తొందరగా జీర్ణం అవ్వదు కాబట్టి ఈ సమయంలో మాంసాహార కలిసిన లేదా మాంసాహార పదార్థాలను తినకూడదు. తింటే అవి మనకు అరగక గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి.

మామూలుగా సలాడ్స్ తింటే మన ఆరోగ్యానికి మంచిదే కానీ చలికాలంలో సలాడ్స్ ఎక్కువగా తినకూడదు. వీటిని తినడం వలన అవి మన శరీరంలో జీర్ణక్రియను మందగించేలా చేస్తాయి. దీని వలన ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

అలాగే చలికాలంలో కూలింగ్ వాటర్, కూల్ డ్రింక్స్ కి కూడా దూరంగా ఉండాలి. కాబట్టి చలికాలంలో మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేవి ఏమిటో మన ఆరోగ్యానికి హాని కలిగించేవి ఏమిటో తెలుసుకొని తినడం వలన చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాము.