Site icon HashtagU Telugu

Morning Practise: ఉదయం లేచిన వెంటనే ఈ ఐదు పనులు అస్సులు చెయ్యకూడదు.. అవి ఏంటంటే?

Vastu Tips

Vastu Tips

ఉదయం లేచిన తర్వాత చాలామంది తెలిసి తెలియక కొన్ని రకాల చేస్తుంటారు. అలా తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల వారి పనిపై, ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపుతాయి. అదేవిధంగా నిద్రలేచిన తర్వాత కొన్ని పనులు చేయకూడదు అని మన ఇంట్లోని పెద్దవారు చెబుతూ ఉంటారు. మరి ఉదయాన్నే ఈ నాలుగు పనులు చేయడం వల్ల అశుభం జరుగుతుందట. మరి ఉదయాన్నే చేయకూడని ఆ నాలుగు పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలామంది ఉదయం లేచిన వెంటనే వారి ముఖాన్ని వారి అద్దంలో చూసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదట. ఉదయం లేవగానే మొదటగా భగవంతుని దర్శనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రతిరోజు చక్కగా ప్రారంభం అవుతుంది. అలాగే ఉదయం లేచిన వెంటనే మీ అరచేతులను కూడా చూసుకోవచ్చు. అలాగే ఉదయం లేచిన వెంటనే తప్పుడు సమయాన్ని చూపించే గడియారం చెడిపోయిన గడియారాన్ని చూడడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే తప్పుడు సమయం చూసినప్పుడు మనం ఆందోళనకు గురవుతాం.

అందుకే ఎప్పుడైనా కానీ ఉదయం లేచిన వెంటనే పనిచేసే గడియారం మాత్రమే చూడాలి. అలాగే ఉదయం లేచిన వెంటనే మురికి పాత్రలు చూడడం వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ సర్క్యూలేషన్ తగ్గిపోతుంది శాస్త్రాల ప్రకారం, రాత్రి వంటగదిని శుభ్రం చేసిన తర్వాత నిద్రపోవాలి. మురికి పాత్రలు ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుంది. ఎందుకంటే కడగని పాత్రల నుంచి దుర్వాసన వస్తుంది. అలా రాత్రి మొత్తం ఆ పాత్రల నుంచి చెడిపోయిన వాసన ఇంట్లో పెరిగిపోతుంది. దీంతో మనం నిద్రలో ఆ దుర్వాసనను తీసుకుంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత మొదటి చూపు తనపై లేదా ఇతరుల నీడపై పడటం మంచిది కాదు.

నీడను చూడటం రాహువు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఉదయం లేవగానే ఆవు కనిపిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే శాస్త్రాల ప్రకారం, ఉదయం వేళ మొదటి చూపు క్రూర జంతువు పై కాకుండా ఆవు వంటి సాధు జంతువులను చూడటం వల్ల మన మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది.