Site icon HashtagU Telugu

Dondakaya Roti Pachadi: దొండకాయ రోటి పచ్చడి.. ఇలా చేస్తే కొంచెం కూడా మిగలదు?

Mixcollage 29 Dec 2023 06 19 Pm 4137

Mixcollage 29 Dec 2023 06 19 Pm 4137

మామూలుగా మనం దొండకాయతో చాలా తక్కువ రెసిపీలు తినే ఉంటాం. దొండకాయ వేపుడు, దొండకాయ మసాలా కర్రీ, దొండకాయ పప్పు, దొండకాయ పచ్చి కారం లాంటి రకరకాల రెసిపీలు తినే ఉంటాం. అయితే ఎప్పుడైనా దొండకాయ రోటి పచ్చడి తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

దొండకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్ధాలు:

దొండకాయలు – పావు కేజీ
పచ్చిమిర్చి – 100గ్రాములు
చింతపండు – సరిపడ
నూనె – రెండు టేబుల్ స్పూన్స్
కొత్తిమీర – పావుకప్పు
ఉప్పు – సరిపడా
నూనె – ఒక టేబుల్ స్పూన్
మెంతులు – ఒక టేబుల్ స్పూన్
ఆవాలు – ఒక టేబుల్ స్పూన్
మినపప్పు – ఒక టేబుల్ స్పూన్
సెనగపప్పు – ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు – ఒక రెబ్బ
నూనె – పావు కప్పు
ఆవాలు – అర టీస్పూన్
జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్
మినపప్పు – అర టీస్పూన్
సెనగపప్పు – అర టీస్పూన్
ఎండుమిర్చి – రెండు
ఇంగువ – చిటికెడు

దొండకాయ రోటి పచ్చడి తయారీ విధానం:

ఇందుకోసం కొద్దిగా నూనె వేసి ముందుగా మెంతులు వేసి వేపుకుని అవి వేగాక ఆవాలు, మినప పప్పు, శెనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకుని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారాక మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే మూకుడులో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి అందులో పచ్చిమిర్చి వేయించుకుని అవి వేగిన తర్వాత తరిగిన దొండకాయ ముక్కలు వేసి బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కలు మగ్గాక చింతపండు వేసి కొద్దిసేపు మగ్గనిచ్చాక దింపేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో చల్లార్చుకున్న దొండకాయ ముక్కలు, మెత్తగా పొడి చేసుకున్న తాలింపు, ఉప్పు వేసి నీళ్ళు పోయకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక కళాయి తీసుకుని అందులో నూనె వేసి ఆవాలు, మినపప్పు, శెనగపప్పు,జీలకర్ర, ఎండుమిర్చి , కొత్తిమీర వేసి వేపుకుని ఆఖరున చిటికెడు ఇంగువ వేసి తాలింపు దింపేసి పచ్చడి లో కలుపుకోవాలి. అంతే దొండకాయ రోటి పచ్చడి రెడీ..

Exit mobile version