Site icon HashtagU Telugu

Dondakaya Masala Curry: ఇంట్లోనే మసాలా దొండకాయ కర్రీని తయారు చేసుకోండిలా?

Dondakaya Masala Curry

Dondakaya Masala Curry

మాములుగా మనం దొండకాయతో అనేక రకాల వంటలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. దొండకాయ కర్రీ,దొండకాయ వేపుడు, బెండకాయ రైస్ ఇలా చాలా రకాల వంటకాలను తయారుచేసుకొని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా మసాలా దొండకాయ కర్రీ ట్రై చేశారా. ఒకవేళ తినకపోతే ఇంట్లోనే మసాలా దొండకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మసాలా దొండకాయ కర్రీకి కావలసిన పదార్థాలు :

దొండకాయలు. – అర కేజీ
ఉల్లిపాయలు – 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు
కారం – 2 టీస్పూన్లు
ధనియాలపొడి. – ఒకటిన్నర స్పూన్
పసుపు – అర స్పూన్
సోంపు పొడి – అర స్పూన్
వేరుశెనగపప్పు – కొద్దిగా
కొత్తిమీర – ఒక కట్ట
ఉప్పు – తగినంత
ఆవాలు – ఒక స్పూన్
దాల్చిన చెక్క – చిన్న ముక్క
మినప్పప్పు – 1 స్పూన్
కరివేపాకు – కొద్దిగా
నూనె – సరిపడా

మసాలా దొండకాయ కర్రీ తయారు చేయు విధానం:

ఇందుకోసం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేయించుకొని,వేరుశెనగపప్పును కూడా కొద్దిగా వేయించి ఉల్లిపాయ ముక్కలు వేరుసెనగపప్పు, దాల్చిన చెక్క మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయల్ని కడిగి పొడవుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అందులో మినపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి వేగాక పసుపు వేసి తరువాత మసాలా పేస్ట్,ధనియాల పొడి, సోంపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం వేసి బాగా వేగాక కట్ చేసిన దొండకాయ ముక్కల్ని వేసి ఒక 15 నిముషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకుని కొత్తిమిరతో గార్నిష్ చేసుకోవాలి.

Exit mobile version