మన దైనందిన జీవితంలో కొన్ని కొన్ని విషయాలను, కొన్ని పనులు చేయడం అలవాటు చేసుకోవాలట. ముఖ్యంగా సాయంత్రం సమయంలో అలాగే ఉదయం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయని తప్పకుండా వాటి గురించి తెలుసుకోవాలని చెబుతున్నారు పండితులు. సాయంత్రం ఏడు తర్వాత కొన్ని రకాల పనులు చేయడం వల్ల జీవితం అద్భుతంగా మారుతుందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాయంత్రం వేళ ప్రశాంతంగా కూర్చొని మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ఆత్మపరిశీలన మీ అనుభవాలను మెరుగ్గా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది.
వ్యక్తిగత వృద్ధిని, స్వీయ అవగాహనను పెంపొందిస్తుందట. ఇలా ప్రశాంతంగా ఆత్మ పరిశీలన చేసుకోవడం వల్ల మీకున్న కష్టాలకు పరిష్కారాలు దొరికే మార్గం కూడా ఉంటుందని చెబుతున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ డిజిటిల్ స్క్రిన్స్ కి చేరువైపోయారు. ఎవరిని చూసినా చేతుల్లో ఫోన్లే ఉంటున్నాయి. రాత్రి నిద్రపోయే వరకు ఫోన్లు, టీవీలను చూసేవారు ఉన్నారు. కానీ, డిజిటల్ స్క్రీన్‌ల నుండి విడిపోవడం కూడా చాలా ముఖ్యం. రాత్రి 7 గంటల తర్వాత ఫోన్‌లు, కంప్యూటర్ లు , టీవీలను చూడటం మానుకోవడం మంచిది. వీటికి బదులుగా, అనలాగ్ కార్యకలాపాలలో మునిగిపోవడం మంచిది. ఫ్యామిలీతో కలిసి గడపడం, మీకు నచ్చిన పని చేయడం లాంటివి చేయడం వల్ల మీ మనస్సుకు కూడా ప్రశాంతత కలుగుతుందని చెబుతున్నారు.
మనకు ప్రతిరోజూ ఏదో ఒక పని ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఏ పనికి అయినా ప్లానింగ్ ఉంటే, మరింత మెరుగ్గా ఉంటుంది. దానికోసం మనం మరుసటి రోజు కోసం ప్లాన్ చేయడం కూడా ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఒక గొప్ప మార్గం. మీరు చేయవలసిన పనుల జాబితాను రాసుకోండి లేదా మీ లక్ష్యాలను రాయాలి. ఇది మీ ఆలోచనలు, పనులను నిర్వహించడానికి, ఆందోళనను తగ్గించడానికి, మీ రోజును మరింత ఉత్పాదకంగా చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుందట. మీకు సమయం దొరికినప్పుడు ధ్యానం చేయడం, ఎక్సర్సైజ్ చేయడం వంటివి చేయడం వల్ల ఒత్తిడి వంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు. ఈ విధమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ద్వారా ఎలాంటి సమస్యలు ఉండవట.