Site icon HashtagU Telugu

Periods: పీరియడ్స్ సమయంలో మొటిమలు వస్తున్నాయా.. అయితే వెంటనే ఇలా చేయండి?

Mixcollage 23 Feb 2024 06 28 Am 4239

Mixcollage 23 Feb 2024 06 28 Am 4239

మామూలుగా స్త్రీలకు ప్రతి నెల నెలసరి రావడం అన్నది సహజం. అయితే ఈ సమయంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. చాలా మందిలో స్కిన్ కేర్ సమస్యలు కూడా వస్తుంటాయి. పింపుల్స్ రావడం, స్కిన్ డ్రై గా అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పీరియడ్స్ సమయంలో నాలుగు ఫేజెస్ ఉంటాయి. అవి menstruation, follicular, ovulation, or luteal phase. అయితే ఈ నాలుగు ఫెజెస్ వచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ సమస్యలు ఉండకుండా ఉండాలంటే మంచి స్కిన్ కేర్‌ని ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అయితే చర్మంపై సమస్యలు ఉండవు.

మెన్సస్ సమయంలో చర్మం చాలా డ్రైగా ఉంటుంది. ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ కారణంగా ఈ సమస్య వస్తుంది. ఇటువంటి సమయంలో నిజంగా స్కిన్ కేర్ చాలా ముఖ్యం. రెగ్యులర్‌గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
క్రీమి క్లైన్సింగ్ వాడటం వల్ల మీ చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది. పైగా ఇబ్బందులు కూడా రావు కాబట్టి ఇటువంటి సమయంలో మీ చర్మం పొడిబారి పోకుండా ఉండడానికి శ్రద్ధ తీసుకోవాలి. పీరియడ్స్ అయిపోయిన తర్వాత బాడీలో ఆస్ట్రోజెన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సమయంలో చర్మం చాలా హెల్తీగా ఉంటుంది. ఇటువంటి సమయంలో కొత్త ప్రొడక్ట్స్ ఉపయోగించవచ్చు. ఇది చాలా తక్కువ సెన్సిటివిటీతో ఉంటుంది. రెగ్యులర్‌గా మాయిశ్చరైజర్ చేయడం వంటివి చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ సమయంలో చాలా అవసరం.. ఈ సమయంలో చాలా మంది మహిళల్లో గ్లో ఉంటుంది.

మరి కొందరి ముఖంలో పింపుల్స్ ఎక్కువగా కనబడుతుంటాయి. ఎందుకంటే చర్మం చాలా ఆయిలీగా మారిపోతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో ఎక్సఫోలియేషన్ చాలా అవసరం లేదా క్లైన్సర్ వంటివి ఉపయోగించి రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోవడం మంచిది. ఇలా ఈ విధంగా చేయడం వల్ల మీ చర్మంలో మార్పు కనబడుతుంది. ఈ సమయంలో ప్రొజెస్టరాన్ రిలీజ్ అవుతుంది ఇటువంటి సమయంలో మీరు సువాసన లేని ఫేస్ వాష్‌ని ఉపయోగించి ముఖాన్ని అందంగా మార్చుకోండి. మాయిశ్చరైజర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎక్స్‌పర్ట్స్ చెప్పిన విధంగా మీరు అనుసరించడం వల్ల అందమైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. పైగా ఆ సమయంలో సమస్యలు రాకుండా కూడా ఉండొచ్చు.