Site icon HashtagU Telugu

Hormonal Breakouts: పీరియడ్స్ సమయంలో వచ్చే మొటిమలకు చెక్ పెట్టిండిలా?

Hormonal Breakouts

Hormonal Breakouts

స్త్రీలకు ప్రతి నెల నెలసరి రావడం అన్నది సహజం. ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి నెల పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా మంది స్త్రీలకు బదించలేని కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. కేవలం కడుపునొప్పి మాత్రమే కాకుండా కొంతమందికి ఈ స్కిన్ కేర్ లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. నిజంగా మహిళలకు పీరియడ్స్ అంటేనే ఒక పెద్ద యాతన అని చెప్పాలి. అటువంటి సమయంలో ఎన్నో రకాల మార్పులు కలుగుతాయి. అనారోగ్య సమస్యలతో పాటు ఇంకా సమస్యలు కూడా ఉంటాయి. హార్మోనల్ మార్పులు కారణంగా ఇటువంటి సమస్యలు వస్తాయి.

ముఖ్యంగా పీరియడ్స్ అయిపోయిన తర్వాత బాడీలో ఆస్ట్రోజెన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సమయంలో చర్మం చాలా హెల్తీగా ఉంటుంది. ఇటువంటి సమయంలో కొత్త ప్రొడక్ట్స్ ఉపయోగించవచ్చు. ఇది చాలా తక్కువ సెన్సిటివిటీతో ఉంటుంది. రెగ్యులర్‌గా మాయిశ్చరైజర్ చేయడం వంటివి చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ సమయంలో చాలా అవసరం.
ఈ సమయంలో చాలా మంది మహిళల్లో గ్లో ఉంటుంది. మరి కొందరి ముఖంలో పింపుల్స్ ఎక్కువగా కనబడుతుంటాయి. ఎందుకంటే చర్మం చాలా ఆయిలీగా మారిపోతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో ఎక్సఫోలియేషన్ చాలా అవసరం లేదా క్లైన్సర్ వంటివి ఉపయోగించి రోజుకు రెండుసార్లు శుభ్రం చేసుకోవడం మంచిది.

ఇలా ఈ విధంగా చేయడం వల్ల మీ చర్మంలో మార్పు కనబడుతుంది. ఈ సమయంలో ప్రొజెస్టరాన్ రిలీజ్ అవుతుంది ఇటువంటి సమయంలో మీరు సువాసన లేని ఫేస్ వాష్‌ని ఉపయోగించి ముఖాన్ని అందంగా మార్చుకోండి. మాయిశ్చరైజర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎక్స్‌పర్ట్స్ చెప్పిన విధంగా మీరు అనుసరించడం వల్ల అందమైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు. పైగా ఆ సమయంలో సమస్యలు రాకుండా కూడా ఉండొచ్చు.