walking : లైట్ వాక్ చేస్తూ, ఇంటి పనులు చేసుకుంటూ రోజంతా కాస్త కదిలితే చాలు… మన శరీరానికి వ్యాయామం అయినట్టే. దీన్ని నిర్ధారిస్తూ తాజాగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో ఓ కీలక అంశం వెలుగులోకి వచ్చింది. వ్యాయామం అంటే కచ్చితంగా జిమ్‌కెళ్లాలి, గంటల తరబడి చెమటోడ్చాలి అనుకోవాల్సిన అవసరం లేదని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. రోజువారీ సాధారణ కదలికలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్ సెంటర్ ఫర్ ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ (Oxford Centre for Early Cancer Detection) నిర్వహించిన ఈ అధ్యయనంలో, రోజుకు వేసే అడుగుల సంఖ్యను ప్రధానంగా విశ్లేషించారు. దీనిలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రతిరోజూ వేసే అడుగుల సంఖ్య పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతున్నట్లు వెల్లడైంది.
అధ్యయన ఫలితాల ప్రకారం:
రోజుకు 5,000 అడుగులు నడిచే వ్యక్తులతో పోలిస్తే
7,000 అడుగులు నడిచేవారిలో క్యాన్సర్ ప్రమాదం 11% తగ్గినట్టు తేలింది
ఇక, 9,000 అడుగులు నడిచేవారిలో ఈ ప్రమాదం 16% వరకు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఇవి వినడమే కాక, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే సాధారణ నడక, తేలికపాటి ఇంటి పనులు, కొంతమేరకు ఇంట్లో చురుకుగా తిరుగడం వంటి చిన్నచిన్న కార్యకలాపాలు కూడా వ్యాయామంగా పరిగణించవచ్చు. ఇవే శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడం, కళ్లెదురు కాని వ్యాధులను నివారించడం వంటి ప్రయోజనాలను కలిగిస్తాయని పరిశోధకులు తెలిపారు. ఇప్పటి వరకు “ఆరోగ్యానికి మేలు చేయాలంటే కఠినమైన వ్యాయామాలు తప్పవు” అనే అపోహ చాలామందిలో ఉంది. కానీ తాజా అధ్యయనం దానిని తేల్చేసింది. వ్యాయామం అనేది ఒక్కదాన్ని కాకుండా, ఒక వ్యక్తి రోజంతా ఎలా కదులుతున్నాడో దానిపై ఆధారపడి ఉంటుందని పరిశోధన స్పష్టం చేసింది.
ముఖ్యంగా, ఇళ్లలో పని చేసే గృహిణులకైతే ఇది శుభవార్తే. వారు రోజంతా పనిలో ఉండటం వల్ల నడక, కదలికలు స్వయంగా జరగుతుంటాయి. అదే విధంగా ఉద్యోగస్తులు కూడా, కూర్చున్న స్థితిలో ఎక్కువసేపు ఉండకుండా ప్రతి గంటకొకసారి లేచి కొద్దిపాటి నడక చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, చురుకుగా ఉండటమే అసలైన వ్యాయామం. వ్యాయామం కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించకపోయినా, రోజంతా చురుకుగా ఉండే విధంగా జీవనశైలిని మార్చుకుంటే చాలట. ఉదాహరణకు దూరాలకు బదులుగా నడిచే అలవాటు చేసుకోవడం. ఎలివేటర్ బదులు మెట్లను ఎక్కడం. పని సమయంలో చిన్న బ్రేక్‌లు తీసుకొని నడక. ఇంటి పనుల్లో చురుకుగా పాల్గొనడం. ఇలాంటివి ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి. కాబట్టి, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. రోజూ మేలైన జీవనశైలిని పాటిస్తూ, తక్కువ కృషిలో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. జిమ్‌కి వెళ్ళే సమయం లేకపోయినా, నడకను మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఇంటి పనులు లేదా చిన్నచిన్న కదలికల ద్వారా శరీరాన్ని చురుకుగా ఉంచండి. ఇవే మీ భవిష్యత్తులో పెద్ద వ్యాధుల నుంచి దూరంగా ఉంచే నిజమైన వ్యాయామాలు.
Read Also: Turmeric Milk : పసుపు కలిపిన పాలు తాగడం వలన కలిగే ప్రయోజనాలు …మరి రాత్రిపూట ఈ పాలు తాగడం మంచిదేనా?