Site icon HashtagU Telugu

Head Shave: గుండు కొట్టించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇందులో నిజమేంత?

Shaving Hair

Shaving Hair

ప్రస్తుత రోజుల్లో చాలామందిని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య జుట్టు ఎక్కువగా ఊడిపోవడం. మరి ముఖ్యంగా మహిళలకు ఇది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఇక మహిళలు జుట్టు పెరగడం కోసం అనేక రకాల షాంపులను, హెయిర్ ఆయిల్ లను, హెయిర్ క్రీం లను వాడుతున్నారు. అయినప్పటికీ వెంట్రుకలు పెరగడంలో ఎటువంటి మార్పులు రావడం లేదు. ఇకపోతే చాలామంది తరచూ గుండు కొట్టించుకోవడం లేదా సేవింగ్ చేసుకోవడం వల్ల ఎక్కువగా వెంట్రుకలు వస్తుంటాయి అని భావిస్తూ ఉంటారు. ఇందులో నిజాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తరచుగా తలన దువ్వుతూ ఉండడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది అని ప్రజలు నమ్ముతూ ఉంటారు.

ఇది నిజమా కాదా అన్న విషయానికి వస్తే ఇది కచ్చితంగా నిజం కాదు. అలాగే జుట్టు పెరుగుదలకు బట్టదలకు ఎటువంటి సంబంధం కూడా లేదు. అలాగే జుట్టును షేవింగ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని శాస్త్రీయ ఆధారాలు కూడా ఏమి లేవు. కాబట్టి షేవింగ్ మీ జుట్టు పెరుగుదలను పెంచదు. జుట్టు రాలే సమస్యలను ఇది నయం చేస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చర్మ నిపుణులు అంటున్నారు. అయితే షేవింగ్ వల్ల కొన్ని లాభాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చుండ్రు సమస్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అలాగే షేవింగ్ చేయడం వల్ల తలపై పేరుకున్న దుమ్ము, ధూళి బయటకు వెళ్లిపోతాయి. పురుషుల్లో షేవింగ్ చేయడం వల్ల జుట్టు రాలడం, బట్టతల వచ్చే ప్రమాదం తగ్గుతుంది. షేవింగ్ తర్వాత జుట్టు పెరుగుదల పెరుగుతుంది. అయితే మీరు మీ జుట్టును షేవ్ చేసినప్పుడు మీరు జుట్టును తీసివేసి, దాని పై ఉన్న మృతకణాలను తొలగిస్తారు. ఈ షేవింగ్ ఉపరితలం పై మాత్రమే జరుగుతుంది. అందువల్ల ఇది జుట్టు యొక్క నిర్మాణాన్ని లేదా జుట్టు యొక్క రంగు లేదా పెరుగుదల రేటును ప్రభావితం చేయదు. కాబట్టి తల షేవింగ్ కొత్త జుట్టు పెరుగుదలను షేవ్ చేయడం వల్ల జుట్టు పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే.

Exit mobile version