Saffron: కుంకుమపువ్వుతో తెల్లగా మారవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే?

మామూలుగా చాలామంది అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం చర్మ రంగును మార్చుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. కొన్ని కొన్ని సార్లు మం

  • Written By:
  • Publish Date - February 4, 2024 / 02:33 PM IST

మామూలుగా చాలామంది అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం చర్మ రంగును మార్చుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించవచ్చు మరి కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. అయితే చర్మం తెల్లగా మారడం అన్నది ఒకరకంగా అపోహ మాత్రమే అని చెప్పాలి. మన రంగు ఏదైనా దాన్ని కాంతివంతంగా మార్చుకోగలం తప్పా ఎవరి చర్మ రంగు వారికి ప్రత్యేకం. ప్రతి చర్మ రంగు కూడా అందంగానే ఉంటుంది. అయితే, దానిని మరింత కాంతివంతంగా అందంగా కనిపించేలా చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఇందులో కుంకుమపువ్వు ను వాడడం కూడా ఒక పద్ధతి.

సాధారణంగా గర్భంతో ఉన్న మహిళలు కుంకుమపువ్వు పాలు తాగుతారు. అదే విధంగా సాధారణ ప్రజలు కూడా ఈ పాలని తాగుతారు. వీటిని తాగడం, చర్మానికి రాయడం వల్ల చర్మం కాస్త కాంతి వంతంగా మారుతుంది. కుంకుమ పువ్వుని సాధారణంగా ఆహారానికి మంచి రంగు వస్తుంది. అంతే కాదు, దీనిని వాడడం వల్ల కొన్ని ఆయుర్వేద ఔషధాల్లోనూ వాడతారు. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే కుంకుమపువ్వు వల్ల కలిగే లాభాల విషయానికొస్తే.. కుంకుమపువ్వులో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియకి హెల్ప్ చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీని పెంచుతాయి.

దీని వల్ల నొప్పులు తగ్గుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దీనిని తీసుకుంటే బ్రెయిన్ హెల్త్ బావుంటుంది. కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల చర్మ రంగు కూడా కాంతివంతంగా మారతుంది. చర్మంపై ఉన్న నల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంటుంది. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. దీనిని వాడడం వల్ల చర్మాన్ని కాపాడేందుకు హెల్ప్ అవుతుంది. దీని వల్ల చర్మంపై ముడతలు, చర్మంపై నల్ల మచ్చలు నివారిస్తుంది. ఇది చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. చర్మ కణాల పునరుత్పత్తిని పెంచుతుంది. వృద్ధాప్యం నుంచి చర్మాన్ని కాపాడుతుంది. కుంకుమపువ్వు వాడడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. మొటిమలు, నల్ల మచ్చలు తగ్గుతాయి. దీనిని తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ ఉండవు. దీనికి ఎలాంటి పరిశోధనలు తేల్చలేదు. మెలనిన్ అనేది శరీరానికి రంగు ఇచ్చే ప్రోటీన్. ఇది చర్మ, కళ్ళు, జుట్టులో కనిపిస్తుంది. మెలనిన్ పరిమాణం మీ రంగుని నిర్ణయిస్తుంది. మెలనిన్ ఎక్కువగా ఉంటే చర్మ రంగు తక్కువగా ఉంటుంది. తక్కువ మెలనిన్ ఉన్నవారు కాంతివంతంగా మారతారు.