Site icon HashtagU Telugu

Coconut Oil: కొబ్బరి నూనెతో ఈ విధంగా చేస్తే చాలు తెల్ల జుట్టు సమస్య మాయం అవ్వాల్సిందే?

Mixcollage 18 Jan 2024 05 58 Pm 6947

Mixcollage 18 Jan 2024 05 58 Pm 6947

ప్రస్తుత రోజుల్లో చాలామంది అనేక రకాల కారణాల వల్ల హెయిర్ ఫాల్స్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇంకొందరు తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. దీంతో తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే ఎన్నో రకాల హెయిర్ కలర్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇవి కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. మళ్లీ కొద్ది రోజులకు తలపై వైట్ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది. అయితే తెల్ల వెంట్రుకల సమస్యకు చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా వాటి వల్ల ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు.

మీరు కూడా తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతుంటే కొబ్బరి నూనెతో మేము చెప్పినట్టుగా చేస్తే చాలు నల్ల జుట్టు రావడంతో పాటు జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయాన్ని వస్తే.. కొబ్బరినూనె, ఆముదం, రోజ్మేరీ ఈ మూడు రకాల పదార్థాలు తీసుకోవాలి. కొబ్బరినూనె అనేది ముందు రోజు నుంచి జుట్టు పెరుగుదలకి వాడవచ్చు. ఇందులో మోనోశాచురేటెడెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకి హెల్ప్ అవుతుంది. జుట్టుకి మెరుపుని అందించి మృదువుగా చేస్తుంది. దీనిని వాడడం వల్ల జుట్టు మాయిశ్చరైజ్డ్‌గా ఉంటుంది. చుండ్రు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఆముదం అనేది జుట్టు పెరుగుదలకి మంచిది.

జుట్టు, గడ్డం, కనుబొమ్మలు పెరగడానికి ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, రిసినోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ ఇ, ఫినోలిక్ యాసిడ్స్, అమైనో యాసిడ్స్, టర్పెనాయిడ్స్, ఫైటోస్టెరాల్స్ వంటి పోషకాలు ఉన్నాయి. రోజ్మేరీ జుట్టు ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. రోజ్మేరీ‌లో కార్నోసిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇందులో చనిపోయే కణాలను పునరుజ్జీవింపజేస్తుంది. మన చర్మానికి, జుట్టుకి చాలా మంచిది. రోజ్మేరీ ఆయిల్ జుట్టుని హెల్దీగా ఉంచుతుంది. దీనిని వాడడం వల్ల జుట్టు తెల్లబడడం తగ్గుతుంది. కొబ్బరి నూనె, ఆముదంలని సమాన పరిమాణంలో తీసుకుని కలపాలి. ఇందులో రోజ్మేరీ ఆకులని వేయాలి. ఇది ఆన్‌లైన్‌లో కూడా దొరకుతుంది. అయితే ఎండిన ఆకులు వేస్తే మంచిది. ఇలా వేసిన ఆయిల్‌ని కొన్ని రోజుల పాటు అలానే ఉంచాలి. అలానే ఉంచి తలకి అప్లై చేసే ముందు డబుల్ బాయిల్ పద్ధతిలో వేడి చేసి తలకి అప్లై చేయడం మంచిది. దీన్ని రాత్రి పడుకునేముందు రాసి మరుసటి రోజు క్లీన్ చేసుకోవాలి. దీని వల్ల జుట్టు పెరుగుతుంది. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.