Grey Hair: తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే నెయ్యిలో ఇవి కలిపి రాస్తే చాలు?

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే తెల్ల జుట్టు రావడానికి అనేక రకా

Published By: HashtagU Telugu Desk
Mixcollage 02 Feb 2024 05 03 Pm 2351

Mixcollage 02 Feb 2024 05 03 Pm 2351

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే తెల్ల జుట్టు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇక ఈ తెల్ల జుట్టు నల్లగా మారడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల హెయిర్ కలర్స్ ఆయిల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు ఫలితం లభించదు.. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో నెయ్యి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి నెయ్యిని ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చుకోవచ్చు అన్న విషయానికి వస్తే..

నెయ్యితో తయారైన ఈ ఆయిల్‌ని రాయడం వల్ల తెల్లజుట్టు తగ్గడమే కాకుండా, జుట్టు రాలడం తగ్గి పెరుగుతుంది. నెయ్యి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా ముఖ్యం. నెయ్యిని వాడి తెల్ల జుట్టు సమస్యని తగ్గించుకోవచ్చు. ఇందులో కరివేపాకు, కాలోంజీ అంటే నల్ల జీలకర్ర, నువ్వుల నూనెతో కలిపి తయారు చేస్తారు. నెయ్యి స్వచ్ఛమైన ఆవునెయ్యి అయితే బెటర్. నెయ్యి అనేది జుట్టుకి తేమని అందిస్తుంది. తెల్ల జుట్టుని దూరం చేస్తుంది. జుట్టుని ఆరోగ్యంగా, అందంగా మారుస్తుంది. నువ్వుల నూనెలో ఈస్ట్రోజెన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, నువ్వుల నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జుట్టుని ఆరోగ్యంగా చేసి పెరిగేలా చేస్తుంది.

కరివేపాకు కూడా జుట్టుని ఆరోగ్యంగా చేసేందుకు చాలా మంచిది. జుట్టుని తెల్లబడకుండా చేస్తుంది. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టు నెరసిపోకుండా చేయడంలో కరివేపాకు మెల్ప్ చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కుదుళ్ళకి కూడా మంచిది. కలోంజి కూడా జుట్టు ఆరోగ్యాన్ని పెంచి జుట్టుని పెరిగేలా చేస్తుంది. దీనిని రాయడం వల్ల జుట్టు నల్లగా మారేందుకు హెల్ప్ అవుతుంది. దీనిని సహజ రంగుగా మారుతుంది. ముందుగా కలోంజీ సీడ్స్ ని గ్రైండ్ చేయాలి. దీనిని మరీ మెత్తగా కాకుండా కాస్తా కచ్చాపచ్చగా చేయాలి. తర్వాత ఒక ఇనుప మూకుడు తీసుకోవాలి. అందులో నువ్వుల నూనె, నెయ్యి వేయాలి. అందులో కరివేపాకు, వేయాలి. అందులో కలోంజీ పొడి వేయాలి. దీనిని సిమ్‌లోనే బాగా మరిగించాలి. దీనిని చల్లారక వడకట్టి సీసాలో పెట్టాలి. దీనిని వారానికి రెండు సార్లు తలకి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది తలస్నానానికి ముందు రోజైనా అప్లై చేయవచ్చు. లేదా ఓ గంట అయినా చేయాలి. తర్వాత మైల్డ్ షాంపూతో క్లీన్ చేసుకోవాలి..

  Last Updated: 02 Feb 2024, 05:03 PM IST