Site icon HashtagU Telugu

Grey Hair: నెయ్యిలో వీటిని కలిపి రాస్తే చాలు తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే?

Mixcollage 03 Dec 2023 09 35 Pm 7290

Mixcollage 03 Dec 2023 09 35 Pm 7290

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా తెల్ల వెంట్రుకల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. దీంతో ఈ తెల్ల జుట్టు కారణంగా నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉండాలి. మరి ముఖ్యంగా చిన్న వయసు వారు ఫ్రెండ్స్ తో కలిసి తిరగాలన్నా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే వెంట్రుకలు తెల్లగా మారడానికి జన్యు కారణాలు, విటమిన్ బి12, విటమిన్ డి, ఐరన్, కాపర్ లోపం, హార్మోన్ల ఇన్‌బ్యాలెన్స్ ఇవన్నీ కారణాలు కావచ్చు. ఇలాంటి సమస్యని దూరం చేయడానికి ఆర్టిఫీషియల్ కలర్స్ రాస్తుంటారు.

దీని వల్ల జుట్టు రంగు నల్లగా మారినా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఆ రంగు కూడా కొన్ని రోజుల్లోనే పోయి వెంట్రుకలు మళ్ళీ తెల్లగా కనిపిస్తాయి. అయితే తెల్ల వెంట్రుకలు నల్లగా మారాలి అంటే నెయ్యితో ఒక రెమెడీని ట్రై చేయాల్సిందే. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెయ్యి ఆరోగ్యానికే కాదు. అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెయ్యిని వాడి తెల్ల జుట్టు సమస్యని తగ్గించుకోవచ్చు. నెయ్యి స్వచ్ఛమైన ఆవునెయ్యి అయితే బెటర్. నెయ్యి అనేది జుట్టుకి తేమని అందిస్తుంది. తెల్ల జుట్టుని దూరం చేస్తుంది. జుట్టుని ఆరోగ్యంగా, అందంగా మారుస్తుంది. అయితే నెయ్యితో పాటు నువ్వుల నూనె, కరివేపాకు,కాలోంజి కలిపి ఉపయోగించాలి.

ముందుగా కాలోంజీని గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా కాకుండా కాస్తా కచ్చాపచ్చగానే చేయాలి. ఇప్పుడు ఒక ఇనుప మూకుడు తీసుకోవాలి. అందులో నువ్వుల నూనె, నెయ్యి వేయాలి. అందులో కరివేపాకు, వేయాలి. అందులో కాలోంజీ పొడి వేయాలి. దీనిని సిమ్‌లోనే బాగా మరిగించాలి. దీనిని చల్లారక వడకట్టి సీసాలో పెట్టాలి. దీనిని వారానికి రెండు సార్లు తలకి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది తలస్నానానికి ముందు రోజైనా అప్లై చేయొచ్చు. లేదా ఒక గంట ముందు అయినా చేయవచ్చు. తర్వాత మైల్డ్ షాంపూతో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే చాలు తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే.

Exit mobile version