Beer Beauty: బీర్ తాగితే అందం పెరుగుతుందా..? ఎంత వరకు వాస్తవం..?

బీర్..విదేశాల్లోనే కాదు..మనదేశంలోనూ అమ్మాయిలు తెగతాగేస్తున్నారు. దీని వెనక బలమైన కారణమే ఉంది. అదేంటంటే...

  • Written By:
  • Publish Date - March 30, 2022 / 09:15 AM IST

బీర్..విదేశాల్లోనే కాదు..మనదేశంలోనూ అమ్మాయిలు తెగతాగేస్తున్నారు. దీని వెనక బలమైన కారణమే ఉంది. అదేంటంటే…బీర్ తాగుతే మంచి రంగు, వెయిట్ గెయిన్ అవుతారట. దీనికోసమే అమ్మాయిలు బీర్లు తాగుతుంటారట. అవును మీరు చదివింది నిజమే. ఒంటికి మంచి రుంగు, బరువు పెరుగుతామన్న కారణంతోనే చాలామంది బీర్లు తాగుతున్నారట. నిజంగా బీర్లు తాగుతే కలర్ వస్తుందా…బరువు పెరుగుతారా…ఇది ఎంతవరకు నిజం…దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

మనదేశంలో బీర్లు ఎక్కువగా తాగుతున్నవారిలో 7.5శాతం ఆడవారే ఉన్నారని గ్లోబల్ రీసెర్చ్ సంస్థ నివేదిక ప్రకారం తెలుస్తోంది. అలాగే కమ్యూనిటీ డ్రంగ్ అండ్ డ్రైవింగ్ సర్వే ప్రకారం…ఈ ఏడాదిలోఆల్కాహాల్ తీసుకునే వారిలో ఆడవాళ్ల సంఖ్య పెరిగిందని తేలిందట. రానున్న ఐదేళ్లలో పాతిక శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

మరో విషయం ఏంటంటే..మనదేశంలో మెట్రో నగరాల్లో నివసించే మహిళలే అధికంగా బీర్లను తాగుతున్నారట. దీనికి కారణాలు ఉన్నాయి. ఫంక్షన్లు, బర్త్ డే పార్టీలు, ఇతర పార్టీల్లో బీర్లను సర్వ్ చేయడం సాధారణం అయ్యింది. ఈ బీర్ లో ఆల్కాహాల్ శాతం తక్కువగా ఉండటం, పిండిపదార్థాలు, కేలరీలు, కొవ్వులు లేకుండా ఉండటంతో వీటి వల్ల ఎలాంటి హానీ ఉండదని…తాగేందుకు ఇష్టపడుతున్నారని పలు సర్వేల్లో తేలింది. అందుకే చాలామంది మద్యానికి బదులుగా బీరును తాగేస్తున్నారట.

బీర్ తో అందం…ఎంత వరకు నిజం..?
బీరు తాగితే బరువు విపరీతంగా పెరుగుతారు. ఆడవాళ్లు బీర్ తక్కువ మొత్తంలో సేవిస్తేనే మంచిది. తక్కువగా తాగినట్లయితే ముఖంలో గ్లో వస్తుంది…జుట్టుకు కూడా మేలు చేస్తుంది. అంతేకానీ అందంతోపాటు జట్టుకు మేలు జరుగుతుందని అతిగా తాగారో మీ పని ఖతం. విపరీతంగా బరువు పెరిగి…అంద విహీనంగా తయారువుతారు.

జుట్టున అప్పుడప్పుడు బీర్ తో కడిగినట్లయితే…మెరుస్తుంది. వెంట్రుకలకు షాంపూను అప్లై చేసి శుభ్రంగా కడిగిన తర్వాత బీర్ తో కడగాలి. తర్వాత వాటర్ తో జుట్టును క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంి. ఇలా నెలకొసారి చేసినట్లయితే మీ జుట్టు మెరుపును సంతరించుకుంటుంది.

ఇక స్కిన్ డీహైడ్రేట్ బారిన పడకుండా చేసేందుకు బీర్ చక్కగా పనిచేస్తుంది. బీర్ తో అప్పుడప్పుడు ముఖాన్ని కడిగినట్లయితే..అందం రెట్టింపు అవుతుందట. అంతేకాదు పురాతన కాలంలోని ఈజిప్షియన్లు అక్కడి వేడిని తట్టుకునేందుకు బీర్లతో స్నానం చేసేవారట.