Site icon HashtagU Telugu

Dandruff: చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతోందా.. అయితే ఇది ఒక్కటి వాడితే చాలు!

Dandruff

Dandruff

ప్రస్తుత రోజుల్లో చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చుండ్రు కారణంగా చాలామంది ఇక ఇబ్బంది పడుతున్నారు. ఈ చుండ్రు సమస్య కొన్నిసార్లు హెయిర్ ఫాల్ సమస్యకు కూడా దారి తీయవచ్చు. ఈ చుండ్రు సమస్య ఉన్నవారికి తల నుంచి తెల్లటి పొర రాలుతూ ఉంటుంది. ఇది చాలా మందికి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. దీనివల్ల నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే చుండ్రు సమస్య అసలు ఉండదు అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చుండ్రును తగ్గించుకోవడానికి మీరు వారానికి రెండు మూడు సార్లు షాంపూతో తలస్నానం చేయాలట. అలాగే జుట్టును కడగడానికి గంట ముందు నూనెను ఖచ్చితంగా పెట్టాలని చెబుతున్నారు. అలాగే జుట్టు పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలట. అయితే మీరు బేకింగ్ సోడాను ఉపయోగించి కూడా ఈ చుండ్రును తగ్గించుకోవచ్చట. బేకింగ్ సోడా, తేనె, కొబ్బరి నూనెను ఉపయోగించి చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చట.అయితే ఇందుకోసం ఒక చెంచా బేకింగ్ సోడాలో ఒకటి నుంచి రెండు చెంచాల కొబ్బరి నూనె, కొద్దిగా తేనె కలిపి పేస్టులా అప్లై చేయాలట.

ఈ పేస్ట్ ను తలకు అప్లై చేయాలనీ, 20 నిమిషాల తర్వాత షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా ఆలివ్ ఆయిల్, బేకింగ్ సోడాను ఉపయోగించి కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చట. ఇందుకోసం ఒక చెంచా బేకింగ్ సోడాలో ఒకటి నుంచి రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ ను కొద్దిగా తేనె కలిపి పేస్ట్ లా తయారు చేయాలట. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలట. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలట. చుండ్రును పోగొట్టడానికి ఒక గుడ్డులో కొద్దిగా బేకింగ్ సోడాను, ఒకటిన్నర టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ ను వేసి బాగా కలపాలట. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే వదిలేయాలట. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చాలు చుండ్రు సమస్య అసలు ఉండదు అని చెబుతున్నారు.

Exit mobile version