ఈ రోజుల్లో చాలామంది అనేక కారణాల ముఖంపై ముడతల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖంపై ఈ ముడతలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో బాగా రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగించడం, స్కిన్ కు సంబంధించి సరైన జాగ్రత్తలు పాటించకపోవడం, హోమ్ రెమిడీస్ ని కూడా ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించడం, కాలుష్యం ఇతర కారణాల వల్ల ముఖంపై ముడతలు సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఇలా ముఖంపై ముడతలు సమస్యలు ఉన్నప్పుడు ఈ ఆయిల్ ని అప్లై చేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అవకాడో ఆయిల్.. దీనిని కొంతమంది వంటల్లో వాడతారు. దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఈ నూనెని సన్‌స్క్రీన్స్, క్రీమ్స్ లోషన్స్‌లో ఎక్కువగా వాడతారు. అవకాడో ఆయిల్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ ఎ, డి, ఈ లు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్కిన్‌పై చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసి చర్మానికి పోషణని అందిస్తుంది. విటమిన్ ఈ ఎక్కువగా ఉన్న అవకాడో నూనెలో పొటాషియం, లెసిథిన్, చర్మానికి తేమని అందించి చర్మం మెరిసేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఈ ఆయిల్ రాయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్, తామర, సోరియాసిస్, పొడి చర్మం, దురద వంటి సమస్యలు దూరమవుతాయి.
ముఖానికి నూనె రాసి కాసేపు అలానే ఉంచితే గోరువెచ్చని నీటితో కడిగితే చర్మంలోని జిడ్డు తగ్గి హైడ్రేట్ అవుతుంది. ఇది మొటిమల ప్రమాదాన్ని దూరం చేస్తుంది. చర్మానికి కొల్లాజెన్ అనేది చాలా ముఖ్యం. దీని వల్ల చర్మంలో సాగే గుణం పెరిగి అందంగా కనిపిస్తుంది. దీని వల్ల కొత్త బంధన కణజాలాలు ఏర్పడతాయి.ఈ ఆయిల్‌లో విటమిన్ ఇ, బీటా కెరోటిన్, విటమిన్ డి, ప్రోటీన్, లెసిథిన్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చర్మ సమస్యలు దూరం చేసి రిలాక్స్ చేస్తాయి. వృద్ధాప్యం కారణంగా చర్మంపై ముడతలు వస్తాయి. అవకాడో లో ఉండే హెల్దీ ఫ్యాట్స్ చర్మాన్ని కాపాడుకోవడంలో హెల్ప్ చేస్తాయి. దీని వల్ల చాలా చర్మ సమస్యలు దూరమవుతాయి. కేవలం చర్మానికే కాదు గోర్లని కూడా రక్షించడంలో ఈ ఆయిల్ బాగా పనిచేస్తుంది. గోర్లు, చుట్టు ఉన్న చర్మాన్ని మృదువుగా చేసి కాపాడతాయి.