Site icon HashtagU Telugu

Skin: ముడతలు తగ్గిపోవాలా.. అయితే ఈ నూనె ముఖానికి రాయాల్సిందే?

Skin

Skin

సాధారణంగా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా అందం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు బ్యూటీ టిప్స్ ని పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితాలు కనిపించకపోయేసరికి బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా అందం విషయంలో ముఖంపై ముడతలు లేకుండా చూసుకోవడానికి ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా ముఖంపై ముడతల సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే ఈ చిట్కాలను పాటించాల్సిందే. మరి ముఖంపై ముడతలు పోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అవకాడో ఆయిల్: చాలామంది అవకాడో ఆయిల్ ని వంటలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే అవకాడో ఆయిల్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ ఎ, డి, ఈ లు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్కిన్‌పై చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసి చర్మానికి పోషణని అందిస్తుంది. విటమిన్ ఈ ఎక్కువగా ఉన్న అవకాడో నూనెలో పొటాషియం, లెసిథిన్, చర్మానికి తేమని అందించి చర్మం మెరిసేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఈ ఆయిల్ రాయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్, తామర, సోరియాసిస్, పొడి చర్మం, దురద వంటి సమస్యలు దూరమవుతాయి.

ముఖానికి నూనె రాసి కాసేపు అలానే ఉంచితే గోరువెచ్చని నీటితో కడిగితే చర్మంలోని జిడ్డు తగ్గి హైడ్రేట్ అవుతుంది. ఇది మొటిమల ప్రమాదాన్ని దూరం చేస్తుంది. అలాగే చర్మానికి కొల్లాజెన్ అనేది చాలా ముఖ్యం. దీని వల్ల చర్మంలో సాగే గుణం పెరిగి అందంగా కనిపిస్తుంది. దీని వల్ల కొత్త బంధన కణజాలాలు ఏర్పడతాయి. కొల్లాజెన్ అనేది ఎక్కువగా మనకు ఆవాల నూనెలో లభిస్తుంది. ఈ ఆయిల్‌లో విటమిన్ ఇ, బీటా కెరోటిన్, విటమిన్ డి, ప్రోటీన్, లెసిథిన్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చర్మ సమస్యలు దూరం చేసి రిలాక్స్ చేస్తాయి.

Exit mobile version