Alcohol: మందుకొడితే మంచి నిద్ర వస్తుందా..? నిజమెంత?

కొంతమందికి సందర్బం ఏదైనా సరే...మందు సేవించడమే పనిగా పెట్టుకుంటారు. ఇలాంటి వారు ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా స్నేహితులతో సరదాగా ఆల్కహాల్ తాగేవారు అదే పనిగా అలవాటు చేసుకుంటున్నారు.

  • Written By:
  • Updated On - January 26, 2022 / 02:57 PM IST

కొంతమందికి సందర్బం ఏదైనా సరే…మందు సేవించడమే పనిగా పెట్టుకుంటారు. ఇలాంటి వారు ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా స్నేహితులతో సరదాగా ఆల్కహాల్ తాగేవారు అదే పనిగా అలవాటు చేసుకుంటున్నారు. ఫలితంగా మద్యానికి బానిసలుగా మారుతున్నారు. కానీ మోతాదుకు మించి ఆల్కహాల్ సేవించినట్లయితే…ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. మితంగా తీసుకున్నట్లయితే శరీరంగా ఉత్సాహంగా ఉంటుంది. కానీ మితంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎండార్పిన్, డోపమైన్ హార్మోన్లు అత్పత్తి అవుతాయి. దీంతో మెదడు ఉత్తేజితం అవుతంుది. శరీరానికి తీసుకునే ఇతర పదార్థాల కన్నా ఆల్కహాలే తొందరగా శరీరంపై ప్రభావం చూపుతుంది. ఈ ఆల్కహాల్ ముందుగా జీర్ణశాయానికి వెళ్లి…అక్కడి నుంచి నేరుగా రక్తంలో కలిసిపోతుంది. తర్వాత మెదడు, కాలేయం నుంచి శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా అవుతుంది.

అయితే ఆల్కహాల్ సేవించినట్లయితే నిద్ర బాగా పడుతుందని చాలామంది అనుకుంటారు. అయితే నిద్రలేమితో బాధపడేవారే..రాత్రి సమయంలో ఆల్కహాల్ ఎక్కువగా సేవిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నాయి. నిద్రలేమితో బాధపడుతున్నవారిలో కొందరు ఆల్కహాల్ తీసుకుంటే…మరికొందరు నిద్రమాత్రలు మింగుతున్నారు. నిజానికి మద్యం సేవించి పడుకున్నట్లయితే హాయిగా నిద్రపడుతుందని అనుకోవడం ఒక అపోహ మాత్రమే. ఇక రాత్రిపూట ఆల్కాహాల్ సేవించిన నిద్రపోదం అనుకునేవారికి నిద్రతోపాటు సమయం వ్రుదా అవడమే కాదు…నిద్రలేమి సమస్య కూడా వస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆల్కహాల్ సేవించడం వల్ల మత్తుకు కొన్ని గంటల వరకు నిద్ర బాగా వస్తుంది కానీ తర్వాత పూర్తి నిద్ర రాదని అధ్యయనాలు తేల్చేశాయి. ఈ సమస్య ఎక్కువగా మగవారిలో కంటే ఆడవారిలోనే అధికంగా కనిపిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మిచిగాన్ యూనివర్సిటీ దీనిపై పరిశోధనలు చేసింది. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఈ పరిశోధనలో 20సంవత్సరాల యువతను తీసుకుని వారికి మొదటిరోజు ఆల్కాహాల్ కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చారు. తర్వాత రోజు కేవలం వాసనకోసమే కూల్ డ్రింగ్స్ లో మందు కలిపి ఇచ్చారు. ఆ తర్వాత వారిని పరిశీలిస్తే….ఆల్కాహల్ సేవించిన రోజు వారు తొందరగా నిద్రపోయినప్పటికీ…కొద్ది సేపటికే మేల్కొన్నారు. ఆ తర్వాత ఎంత సేపటికి కూడా నిద్రపట్టక మసలడాన్ని గమనించారు. మద్యం సేవించడం ద్వారా ప్రశాంతంగా నిద్రపోతామనుకోవడం అపోహాగా తేల్చారు. ఇంకో విషయం ఏంటంటే ఆల్కహాల్ తీసుకుంటే కాలేయం దెబ్బతి…కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు ఆల్కాహాల్ ఎక్కువగా సేవించడం వల్ల జీర్ణాశయంలో ఆమ్లాల సంఖ్య పెరుగుతుంది. దీంతో పేగుల్లో అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్కాహాల్ ఆకలి లేకుండా చేయడంతోపాటు కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంది.