Site icon HashtagU Telugu

Weight Loss: తేలికగా బరువు తగ్గాలనుకుంటున్నారా?

Weight

Weight

బరువు తగ్గాలనుకోవడం చాలా మంది కల. దీనికోసం ఏవేవో కసరత్తులు చేస్తుంటారు. అయినా సరైన రిజల్ట్ ఉండదు. అలాంటి వారి కోసం హెల్దీగా వెయిట్ లాస్ మరియు డైటింగ్, వర్కౌట్ లేని కొన్ని టిప్స్ ఏంటో చూదాం.

నెమ్మదిగా తినడం:

చాలా మంది దీనిని తక్కువ చేసి చూస్తారు. కానీ, నిజంగా బరువు తగ్గించే విషయాల్లో ఇది ముందు ఉంటుంది. మీరు నిజంగా నెమ్మదిగా నమిలి, తక్కువగా తింటూ ఎక్కువ సమయాన్ని తీసుకుంటే మీరు కడుపు నిండిన ఫీలింగ్‌ ని పొందుతారు. 15 నుంచి 20 నిమిషాల పాటు కొద్దికొద్దిగా నములుతూ తింటే మీ బ్రెయిన్ ఫుల్‌గా తిన్నానన్న ఫీలింగ్‌ ని ఇస్తుంది.

ఆహారం మీద దృష్టి:

మన బిజీ షెడ్యూల్ లో లేదా ఏదైనా పార్టీకి వెళ్ళినపుడు, ఆకలి వేస్తే ఏది పడితే అది, ఎంత పడితే అంతా తినేస్తూ ఉంటాము. అలా తినడం అస్సలు మంచిది కాదు. అందుకే, ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో కూడా చూసుకోవాలి. మనకి ఎంత తినగలమో అంతే తినాలి. మితిమీరిన ఆహారం తినడం లేదా మొక్కుబడిగా తినడం మంచిది కాదు.

ప్రోటీన్ మరియు పీచు పదార్థాలు:

ప్రోటీన్ మరియు ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం డైట్‌లో చేర్చుకోవడం మంచిది. మనం తెసుకునే ఆహారంలో ప్రోటీన్ మరియు ఫైబర్‌ ఎక్కువగా ఉన్నట్లైతే, మన కడుపు నిండుగా ఉంటుంది. దాంతో ఆకలి తక్కువగా వేస్తుంది. మీ గట్‌ ని కూడా సరిగ్గా ఉంచుతుంది.

స్నాక్స్‌కి దూరం:

ప్రతి రెండ్రోజులకి మీ ఫ్రిజ్‌ని అన్ హెల్దీ ఫుడ్ బదులు హెల్దీ స్నాక్స్‌తో ఫిల్ చేయండి. హమ్మస్, స్టాక్ క్యారెట్స్, దోసకాయ, బీట్‌రూట్స్ వంటివి తినండి. ఆకుకూరలతో మంచి సలాడ్స్ తయారు చేసుకోండి. మొలకలు, యోగర్ట్ కూడా చేర్చుకుంటే మంచిది.

సాఫ్ట్ డ్రింక్స్ వద్దు:

సాఫ్ట్ డ్రింక్స్ లో షుగర్ మరియు ఆర్టిఫిషల్ ఫ్లేవర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి తాగడం వల్ల మనకు డయాబెటిస్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు అదైనా డ్రింక్ తాగాలి అనిపించినప్పుడు హెల్దీ డ్రింక్స్ కొబ్బరినీళ్లు, నిమ్మరసం లాంటివి ఇంట్లోనే చేసుకోని తాగడం మంచిది.

రెండు గ్లాసుల నీరు:

భోజనానికి 20 నిమిషాల ముందు రెండు గ్లాసుల నీరు తాగడం చాలా మంచిది. దీనిపై ఎంతో మంది బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ, నిజంగా పనిచేసింది. భోజనానికి ముందు నీరు తాగినప్పుడు అది భోజన సమయంలో ఎక్కువగా తినడాన్ని కంట్రోల్ చేసింది. దీంతో అవసరమైనంత మాత్రమే తినగలుగుతాం.

మంచి నిద్ర:

మంచి నిద్ర కూడా బాడీకి చాలా అవసరం. కాబట్టి హాయిగా నిద్రపోండి. నిద్రకి 30 నిమిషాల ముందు స్క్రీన్ టైమ్‌ని తగ్గించండి. పుస్తకాన్ని చదవడం, రాయడం, మ్యూజిక్ వినడం చేయండి. కానీ, గ్యాడ్జెట్స్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. సరైన నిద్రతో మంచి ఆరోగ్యం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ టిప్స్ మీరు కూడా అనుసరించి హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి.