Site icon HashtagU Telugu

Guava Fruit : జామ పండుతో మెరిసే అందాన్ని మీ సొంతం చేసుకోండిలా?

Do You Want To Get Glowing Beauty With Guava Fruit..

Do You Want To Get Glowing Beauty With Guava Fruit..

Guava Fruit for Glowing Skin : జామపండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. జామ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. తరచూ జామపండుని తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు. అయితే జామపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. జామ పండును (Guava Fruit) మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రావు. ఇందులో ఉండే ఆంటీ యాక్సిడెంట్లు ముడతలు గీతలు పడకుండా నివారిస్తాయి. అయితే ముఖంపై శరీరం పై ఉన్న ముడతలు తొలగించాలంటే ఒక జామపండు రెండు జామ ఆకులు తీసుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి.

మరొక బౌల్లో ఒక గుడ్డు లేదా అందులో ఉండే తెల్ల సున్నను తీసుకొని బాగా బీట్ చేసి వాసన రాకుండా ఉండడం కోసం ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకోవచ్చు. ఇది కేవలం వాసన రాకుండా ఉండడం కోసం మాత్రమే. తర్వాత అందులో జామ (Guava) మిశ్రమాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకున్న తర్వాత పావుగంట సేపు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా తరచూ చేస్తూ ఉండటం వల్ల ముడతలు మాయం అవుతాయి. జామపండు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. జామపండులో 81% నీరు ఉంటుంది. జామపండు (Guava Fruit) తినడం వల్ల శరీరంలోకి నీరు నెమ్మదిగా విడుదలవుతుంది. ఇది చర్మ కణాలకు తేమను అందిస్తుంది. మృదువైన చర్మం పొందడానికి జామ పండు ఫేస్‌ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు.

దీనికోసం అరకప్పు క్యారట్ ముక్కలు, ఒక జాపండు తీసుకొని రెండూ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరి. ఈ విధంగా తరచూ చేయడం వల్ల మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. అంతేకాకుండా ముఖంపై ఉండే మచ్చలు కూడా మాయమవుతాయి. జామకాయ (Guava) చర్మ ఛాయను మెరుగుపరచడానికీ సహాయపడుతుంది. పండిన జామను మెత్తని గుజ్జుగా చేసి, గుడ్డు పచ్చసొనను యాడ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌గా వేసుకోవాలి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనిచ్చి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ చర్మ ఛాయ మరింత మెరుగుపడుతుంది.​

జామ పండును పాలతో కలిపి ఫేస్‌ప్యాక్‌గా ఉపయోగించడం వల్ల ప్రరకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ఇందుకోసం ఒక జామ పండును తీసుకొని గింజలు తొలగించి పక్కన పెట్టుకోవాలి. దీంతో పాటు మరో రెండు జామ ఆకులను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రెండు టీస్పూన్ల పాలు కూడా చేర్చి మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌లో అర టీ స్పూన్ పాల పొడి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్త్లె చేసుకోవాలి. ఒక పావుగంట పాటు అలాగే ఉంచుకొని కడిగేస్తే సరి. ఈ ప్యాక్‌ని తరచూ అప్లై చేస్తే ప్రకాశవంతమైన చర్మం పొందవచ్చు.

Also Read:  Capsicum Beauty Benefits:​ అందాన్ని రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే క్యాప్సికంతో ఇలా చేయాల్సిందే?