Site icon HashtagU Telugu

Hair Growth: ఒత్తైనా జుట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారా.. అయితే ఇది ట్రై చేయండి!

Hair Care Tips

Hair Care Tips

అప్పుడు వాటి జుట్టును ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్క అమ్మాయి కూడా పొడవాటి అందమైన జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటుంది. కానీ ప్రతి పది మందిలో ఒకరు ఇద్దరికీ మాత్రమే జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటుంది. మెల్లగా వారికి హేర్ పాలు డాండ్రఫ్ ఇలా అనేక కారణాల వల్ల పలుచని చుట్టూ ఉంటుంది. అయితే ఈ జుట్టు సమస్యలు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇక జుట్టు సమస్యలను తగ్గించుకొని ఒత్తైనా, పొడవాటి జుట్టును పెంచుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించవు.

మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వెజిటబుల్ ఆయిల్ వాడటం వల్ల తిరిగి అందమైన జుత్తిని సొంతం చేసుకోవచ్చు. కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ మరియు ద్రాక్ష విత్తనాల నూనెలని తీసుకొని ఒక గిన్నెలో కలుపుకోవాలి. 10 సెకండ్ల పాటు ఈ ఆయిల్ ని వేడి చేసుకోవాలి. ఈ నూనె లో లావెండర్ రోజ్ మేరీ వంటి సుగంధ తైలాలను కూడా కలుపుకోవచ్చు. నూనె రెండు చుక్కలు ఈ వేడి నూనెకి జోడించాలీ. మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి..నూనె వేడి మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా చూసుకోవాలి. గోరు వెచ్చగా ఉండే నూనెతో మీ తలపై ఉండే చర్మంపై మర్దనా చేస్తూ జుట్టు చివరి వరకు నూనెతో రాయాలి.

ప్రతి విభాగంలోనూ జుట్టును ఇదేవిధంగా మర్దనా చేయాలి. తర్వాత గాలి తగలకుండా ప్లాస్టిక్ కవర్ తో కప్పి ఉంచాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే హీటింగ్ కేప్ కింద ఒక 15 నిమిషాలు కూర్చోవాలి. లేదంటే తలపై ఒక వేడి టవల్ని చుట్టుకుని ఆ టవల్ కి ఇంకొక టవల్ చుట్టాలి. కాసేపటి తర్వాత మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా తరచుగా చేస్తూ ఉండడం వల్ల మీ జుట్టులో కచ్చితంగా మార్పుని గమనించవచ్చు.

Exit mobile version