Site icon HashtagU Telugu

Ladies Finger: బెండకాయలు నానబెట్టిన నీళ్లను తాగితే.. ఎంత లాభమో తెలుసా?

Ladies Finger soaked water Benefits

Lady Finger

మానవ శరీరానికి ఎంతో మేలు చేసే బెండకాయ.. ఆరోగ్యానికి ఉపయోగపడే అంశాలు ఈ బెండకాయలో (Ladies Finger) పుష్కలం. అయితే బెండకాయను నానబెట్టిన నీటిని తీస్కోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా..? అయితే..ఇప్పుడు తెలుసుకుందాం. రక్తహీనత అనేది చాలా మందిని వేధిస్తుంటుంది. ముఖ్యంగా స్త్రీలలో ఈ వ్యాధి అధికం. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతూ ఉంటుంది. దీనికి బెండకాయ (Ladies Finger) నానబెట్టిన నీళ్లను తీసుకుంటే..చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బెండకాయ వాటర్ తీస్కోవడం వల్ల రెడ్ సెల్స్ పుష్కలంగా అభివృద్ధి చెందుతాయి. తద్వారా తగినంత హిమోగ్లోబిన్ శాతం ఉత్పతవుతుంది.

బెండకాయ నీరు తగ్గు, గొంతు నొప్పులను తగ్గించేందుకు సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. గొంతు వాపు, దగ్గు, గొంతులో దురద వంటి సమస్యలను బెండకాయలో ఉండే యాంటీ సెఫ్టిక్ లక్షణాలు సమర్థవంతంగా ఎదురుకుంటాయి. ఈ మధ్య కాలంలో షుగర్ వ్యాధి కూడా ఉన్నవారికి పెను ముప్పుగా మారింది. వారికి బెండకాయ ఉపయోగపడుతుంది. బెండకాయలో ఇన్సులిన్ ప్రాపర్టీలు అధికంగా ఉంటాయి. ఇవి చక్కర వ్యాధిని నియంత్రించడానికి తొడ్పడతాయి. నానబెట్టిన బెండకాయను తీసుకోవడం వల్ల..రక్తంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు. అతిసారాన్ని నియంత్రించడంలో కూడా ఈ వాటర్ సహాయపడుతుంది.

నాన పెట్టిన బెండకాయ నీరు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. బెండకాయకు నీటిలో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇదీ శరీరంలో పేరుకుపోయిన కోలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తద్వారా గుండెపోటు వంటి సమస్యలను నివారించుకోవడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. బెండకాయ రక్తస్థాయిలను కూడా క్రమబద్దీకరిస్తోంది. బెండకాయలను ముక్కలుగా కోసి.. రాత్రంత నానబెట్టి.. ఉదయాన్నే ఆ నీరును తీసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి.

Also Read:  Sania Mirza in India Cricket: వుమెన్స్ ఐపీఎల్ లో సానియా మీర్జా