Site icon HashtagU Telugu

Socks in Winter : శీతాకాలంలో సాక్స్ వేసుకొని పడుకుంటున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే..

Do You Sleep Wearing Socks In Winter.. But If You Are In Danger..

Do You Sleep Wearing Socks In Winter.. But If You Are In Danger..

Sleeping with wearing Socks in Winter Season : మనలో చాలామందికి రాత్రి సమయంలో పడుకునే ముందు సాక్స్ వేసుకొని పడుకోవడం అలవాటు. ముఖ్యంగా చలికాలంలో చాలామంది కాళ్లకు సాక్స్ (Socks) వేసుకోకుండా అసలు పడుకోలేరు. చలి నుంచి రక్షణ పొందడం కోసం పాదాలకు ఈ విధంగా సాక్స్ (Socks) వేసుకొని పడుకుంటూ ఉంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అంటున్నారు వైద్య నిపుణులు. మరి చలికాలంలో పడుకునేటప్పుడు సాక్సులు వేసుకొని పడుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

రాత్రి పడుకునే ముందు సాక్స్ ధరించడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఎందుకంటె ఒక వ్యక్తి సాక్స్ ధరించి నిద్రిస్తున్నప్పుడు అది శరీర ఉష్ణోగ్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. చలికాలంలో రాత్రిపూట సాక్స్‌లు వేసుకొని నిద్రించడం వల్ల మీరు వేడెక్కడం, చెమటలు పట్టడం తలనొప్పి వంటి కొన్ని సమస్యల ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఒక వ్యక్తి సాక్స్ ధరించి నిద్రిస్తున్నప్పుడు రక్త ప్రసరణ సమస్యలు కలిగిస్తుంది. గట్టి సాక్స్‌లతో నిద్రిస్తున్నప్పుడు ఇది చాలా సమస్యగా మారవచ్చు. కాబట్టి వీలైనంత వరకు సాక్స్ ధరించకపోవడమే మంచిది. అంతేకాదు రాత్రిపూట సాక్స్‌తో పడుకోవడం వల్ల చర్మానికి అలర్జీ వస్తుంది. ఎందుకంటే రోజంతా సాక్స్ వేసుకుంటే వాటికి దుమ్ము అంటుకుంటుంది.

ఇంకా ఈ సాక్స్ ధరించి రాత్రి పడుకోవడం వల్ల ఫుట్ ఇన్ఫెక్షన్ సమస్యలు, చర్మ అలర్జీలు వస్తాయి. రాత్రి పడుకునే ముందు సాక్స్ ధరించడం కూడా మీ నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బిగుతుగా ఉండే సాక్స్ కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. రాత్రి పడుకునే ముందు సాక్స్ ధరించడం వల్ల మీ గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఆర్థరైటిస్ రక్త నాళాలపై ప్రభావం చూపుతుంది, దీని వలన గుండెకు రక్తాన్ని పంప్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి చలికాలంలోనే కాకుండా మామూలుగా కూడా ఈ సాక్స్ ధరించి పడుకోవడం అలవాటుని మానుకోవడం మంచిది.

Also Read :  UPI Payments : యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..