Waffle Rice – Weight Loss : వెయిట్ లాస్.. షుగర్ కంట్రోల్.. దంపుడు బియ్యం బెస్ట్

Waffle Rice - Weight Loss : తెల్ల బియ్యం.. ఎంత తెల్లగా ఉంటే, వాటిని అంతగా పాలిష్ చేశారని అర్ధం.

Published By: HashtagU Telugu Desk
Waffle Rice Weight Loss

Waffle Rice Weight Loss

Waffle Rice – Weight Loss : తెల్ల బియ్యం.. ఎంత తెల్లగా ఉంటే, వాటిని అంతగా పాలిష్ చేశారని అర్ధం. ఇలా పాలిష్ చేసిన తెల్ల బియ్యం ఆరోగ్యానికి మంచివి కావు. పాలిష్ చేయని బియ్యాన్ని దంపుడు బియ్యం అంటారు. ఇవి వాటి సహజమైన బ్రౌన్ రంగులో ఉంటాయి. ఇలా సహజత్వంతో పాలిష్ లేకుండా ఉండటం వల్ల దంపుడు బియ్యంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. తెల్ల బియ్యంపై పొట్టు తీసేసి పాలిష్ చేస్తారు. అదే దంపుడు బియ్యంపై పొట్టు అలాగే ఉంటుంది. ఈ పొట్టులో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అయితే  దంపుడు బియ్యాన్ని కూడా ఒకసారి పాలిష్ చేస్తారని మనం గుర్తుంచుకోవాలి. అందుకే డాక్టర్లు కూడా దంపుడు బియ్యాన్ని తినమని సిఫార్సు చేస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

తెల్ల బియ్యం తినేవారితో పోలిస్తే దంపుడు బియ్యం తినేవారికి షుగర్ వ్యాధి వచ్చే రిస్క్ తక్కువ. ఈవిషయం చెప్పింది మామూలు డాక్టర్లు కాదు.. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. రోజూ మూడు పూటలు దంపుడు బియ్యం తినలేకపోతే.. కనీసం ఒక పూట దంపుడు బియ్యాన్ని తింటే షుగర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఇప్పటికే షుగర్ ఉన్నవారికి అది కొంత కంట్రోల్‌లోకి వస్తుంది. హైబీపీ(అధిక రక్తపోటు) ప్రాబ్లమ్ కూడా దరిచేరదు. దంపుడు బియ్యంలో సోడియం చాలా తక్కువగా ఉండటం వల్ల హైబీపీ దరిచేరదు.

హైబీపీ దరిచేరదు

మనం అన్నం వండేటప్పుడు అందులో ఉప్పును కలుపుతాం. తద్వారా మన బాడీలో సోడియం నిల్వలు పెరుగుతాయి. దంపుడు బియ్యం తీసుకోవడం మొదలుపెడితే మన శరీరంలోని సోడియం నిల్వలు తగ్గి.. హైబీపీ దరిచేరదు. అంతేకాదు దంపుడు బియ్యం తింటే త్వరగా ఆకలి వేయదు. కాస్త అన్నాన్ని తింటే చాలు.. పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. బరువు తగ్గాలని భావించే వారికి దంపుడు బియ్యం బెస్ట్. అయితే ఇది తిన్నాక జీర్ణమవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయులు ఒకేసారి పెరిగిపోవు. అందుకే షుగర్ ఉన్నవారు దంపుడు బియ్యం తినడం(Waffle Rice – Weight Loss) ఉత్తమం.

Also Read: England Knocked Out: ప్రపంచ కప్‌ నుంచి ఇంగ్లండ్ నిష్క్రమణ.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో 33 రన్స్ తేడాతో ఓటమి..!

​​గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ,  మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే. 

  Last Updated: 05 Nov 2023, 07:26 AM IST