చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ లోనే చలి విపరీతంగా కనిపిస్తోంది. ఈ ఉష్ణోగ్రతలు తగ్గడంతోపాటు..చర్మం పొరలుగా మారడం, జలుబు, అకస్మాత్తుగా బరువు పెరగడం సర్వసాధారణం.
చలికాలంలో బరువు ఎందుకు పెరుగుతారు.
చలికాలంలో…మామూలు కాలల వలే చురుకుగా ఉండము. మన రోజువారీ జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. చలికి ఏ పనులు చేయలేకపోతాం. దీంతో అధిక కేలరీల వల్ల బరువు పెరుగుతాం. చలికాలంలో బరువు పెరగడానికి చాలా కారణాలున్నాయి. అవేంటో చూద్దాం
1. పెరిగిన క్యాలరీ :
శీతాకాలంలో అధిక కేలరీలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకుంటాం. స్వీట్లు, కొలెస్ట్రాల్ ఫుడ్, పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుంది.
2. శారీరక శ్రమలో మార్పు:
చాలా మంది తమ దైనందిన కార్యకలాపాలను జలుబు, లేద చలి కారణంగా మార్చుకుంటారు. వ్యాయామం చేయడానికి బద్దకిస్తుంటారు. ఫలితంగా, ప్రతిరోజూ తక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
3. సీజనల్ డిజార్డర్స్ :
చలికాలంలో వ్యాధులు ఎక్కువగా సంక్రమిస్తుంటాయి. చలికాలంలో వచ్చే ఒక రకమైన డిప్రెషన్. ఇది తేలికపాటి నుండి తీవ్రంగా మారుతుంది. జీవన నాణ్యతపై ప్రభావాన్ని చూపుతుంది. సీజనల్ డిజార్డర్ కారణంగా హార్మోన్లు, న్యూరోట్రాన్స్మిటర్లలో మార్పులు కనిపిస్తాయి. దీనితో పాటు, నిద్ర విధానాలలో మార్పులు కూడా ఆకలిని పెంచుతాయి. అధిక నిద్ర, తక్కువ కార్యాచరణ, అసౌకర్యం కారణంగా బరువు పెరుగుతారు.
4. కోరికలు:
చలికాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. తినాలనే కోరిక ఎక్కువగా ఉండటంతో చలిలో వేడి ఆహారాన్ని వండడం, చక్కెర లేదా తీపి పదార్థాలు తీసుకోవడం, కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల బరువు పెరుగుతాము.
5. వ్యాయామం లేకపోవడం :
వేసవిలో, వర్షాకాలంలో చేసేంతగా శీతాకాలంలో మనం వ్యాయామం చేయలేము. చలికాలంలో స్వెటర్ లేకుండా ఉండలేము. మనం సాధారణంగా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాం. వ్యాయామం చేయడానికి బయటికి వెళ్లేందుకు జంకుతుంటాము. కాబట్టి ఇంట్లో వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం చేసేటప్పుడు ధరించే బట్టలు నుండి శరీరం విముక్తి పొందాలి. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే బరువు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది.
చలికాలంలో బరువు పెరగడం తీవ్రమైన ఆరోగ్య సమస్యా?:
ఇదొక ఆరోగ్య సమస్య కాదు. అయినప్పటికీ గణనీయమైన బరువు పెరిగేందుకు దారి తీస్తుంది. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.