Site icon HashtagU Telugu

Asana For Men: ఈ ఆసనం వల్ల పురుషులకు ఎన్ని లాభాలో తెలుసా..?

Gorakshana

Gorakshana

యోగాలో ఎన్నో రకాల ఆసనాలు ఉన్నాయన్నసంగతి తెలిసిందే. ఒక్కో ఆసనం వేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీలైనట్లు ఆసనాలు చేస్తుంటారు. కొన్ని కష్టమైన ఆసనాలు కూడా ఉంటాయి. కొన్ని సులభంగా ఉంటాయి. ఇక ప్రత్యేకంగా స్త్రీ, పురుషుల కోసం వేర్వేరు ఆసనాలు ఉంటాయి. వాటిని వేస్తే పలు రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆసనం…పురుషులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

గోరక్షాసనం వేయడం వల్ల పురుషులకు ఎలాంటి లభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
ముందుగా నేలపై పద్మాసనంలో కూర్చోవాలి. తర్వాత రెండు చేతులను రెండు మోకాళ్లపై ఉంచాలి. పాదాలను రెండింటిని దగ్గరికి తీసుకొచ్చి ఒకదానికి ఒకటి అతికించినట్లు ఉంచాలి. తర్వాత రెండు చేతులను మోకాళ్ల మీద నుంచి తీసి కుడి చేత్తో ఎడమ మడమను, ఎడమ చేత్తో కుడి మడమను పట్టుకోవాలి. ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి. ఇలా రోజూ ఆ ఆసనాన్ని కనీసం పది నిమిషాల పాటు వేస్తే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

లాభాలివే..
ఈ ఆస‌నం వేయ‌డం వ‌ల్ల పురుషుల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. పురుషుల్లో వీర్యం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది. శృంగార స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. సంతాన లోపం ఉన్న‌వారు ఈ ఆస‌నం వేస్తే ఫ‌లితం ఉంటుంది. ఇక ఈ ఆసనం వేయ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

ఈ ఆస‌నాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా రోజూ వేస్తుంటే స్త్రీల‌లోనూ గ‌ర్భాశ‌య స‌మ‌స్య‌లు కూడా పోతాయి. జీర్ణాశ‌యంలో ఉండే గ్యాస్ మొత్తం దెబ్బ‌కు బ‌య‌ట‌కు వ‌స్తుంది. అలాగే పొట్ట దగ్గ‌ర ఉండే కొవ్వు క‌రుగుతుంది. అక్క‌డి కండ‌రాలు దృఢంగా మారుతాయి. ఇక మోకాళ్ల నొప్పులు, మ‌డ‌మ‌ల నొప్పులు పేగుల్లో స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఈ ఆస‌నాన్ని వేయ‌రాదు.

Exit mobile version