Site icon HashtagU Telugu

Pregnancy Tips : ప్రెగ్నెన్సీ సమయంలో మధుమేహం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

Pregnancy

Do You Know What To Do To Prevent Diabetes During Pregnancy..

Prevent Diabetes during Pregnancy : ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో 8 మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే.. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అతి చిన్న వయసులోనే ఈ డయాబెటిస్ రావడంతో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే చాలామంది స్త్రీలకు ప్రెగ్నెన్సీ (Pregnancy) సమయంలో కూడా మధుమేహం వస్తూ ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో మధుమేహం రాకుండా ఉండాలంటే కొన్ని రకాల చిట్కాలను పాటించడం తప్పనిసరి. మరి ముఖ్యంగా రాత్రి సమయంలో పడుకునేటప్పుడు వైద్యులు చెప్పిన సలహాలు పాటించాలి. మరి ప్రెగ్నెన్సీ (Pregnancy) సమయంలో మధుమేహం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

గర్భవతిగా ఉన్నప్పుడు షుగర్ వ్యాధి వస్తే తల్లి రక్తంలో షుగర్ పెరుగుతుంది. అది కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే గర్భిణీ స్త్రీలు రాత్రి నిద్రించడానికి కొన్ని గంటల ముందు గదిలో వెలిగే లైటును డిమ్ చేయాలట. లైట్లును డిమ్ చేయడం వల్ల మహిళలలో గర్భాధారణ మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుందట. పడుకునే మూడు గంటల ముందు లైట్లు డిమ్ చేయాలి. గర్భిణీ స్త్రీలు నిద్రించడానికి మూడు గంటల ముందే లైట్లు డిమ్ చేస్తే మంచిదట.

జీరో వాట్ బల్బులను వినియోగించి స్మార్ట్ ఫోన్ కంప్యూటర్ లేదా ఇతర గాడ్జిల్లా కాంతిని మస్కబారిస్తే వారికి గర్భధారణ సమయంలో
మధుమేహం వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందట. గర్భధారణ మదుమేహం ఉన్న స్త్రీలు పడుకునే ముందు ప్రకాశవంతమైన కాంతికి గురవుతారని ఒక పరిశోధనలో తేలిందట. కాబట్టి నిద్రకు ముందు కాంతికి గురవడం వలన గర్భధారణ మధుమేహం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అని పరిశోధనలో తెలిపారు. ప్రకాశంవంతమైన కాంతి ప్రెగ్నెన్సీ మహిళల్లో గర్భధారణ మధుమేహాన్ని కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ మహిళలు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ప్రెగ్నెన్సీ మధుమేహం స్త్రీల కడుపులో సమస్యలను తెచ్చిపెడుతుంది. దానివలన గుండె జబ్బులు, మతిమరుపు, మధుమేహం లాంటి ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. దాంతో పాటు పుట్టిన పిల్లలకు కూడా రక్తపోటు, ఊబకాయం, మతి మరుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. వైద్యులు ఎన్నో పరిశోధనలు జరిపిన తర్వాత ఈ విషయాలను వెల్లడించారు.

Also Read:  Michaung Cyclone: మిచాంగ్ తుఫాను బీభత్సం.. రూ.11 వేల కోట్లకు పైగా నష్టం..?