Health Insurance Plan: నూటికి నూరు శాతం చెల్లించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏమిటో తెలుసా?

అకో జనరల్ ఇన్సూరెన్స్ ఓ సరికొత్త హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను మార్కెట్ లోకి తెచ్చింది . ఈ సంస్థ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ సేవల్లోకి అడుగు పెట్టడం ఇదే

Published By: HashtagU Telugu Desk
Do You Know What Is A Health Insurance Plan That Pays One Hundred Percent

Do You Know What Is A Health Plan That Pays One Hundred Percent

అకో జనరల్ ఇన్సూరెన్స్ ఓ సరికొత్త హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ (Health Insurance Plan) ను మార్కెట్ లోకి తెచ్చింది . ఈ సంస్థ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ సేవల్లోకి అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. ‘ప్లాటినం హెల్త్ ప్లాన్’ పేరుతో చక్కని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను మన ముందుకు తీసుకొచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో (Health Insurance Plan) ఏ ఇతర కంపెనీ అందించని కొత్త ఫీచర్లను అకో ఆఫర్ చేస్తుండడం విశేషం. పాలసీదారు వైద్యం కోసం క్లెయిమ్ పెట్టుకుంటే చెల్లించే మొత్తంలో ఎలాంటి కోత పెట్టదు. అంటే ఎంచుకున్న బీమా పరిధిలో నూరు శాతం చెల్లింపులు చేస్తుంది. ఇతర బీమా సంస్థలు కన్జ్యూమబుల్స్ కు చెల్లింపులు చేయవు. అలాంటి కొన్నింటికి మినహాయించి మిగిలిన మేర చెల్లిస్తాయి. కానీ, అకో అలా కాదు.

సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత నుంచి అన్ని రకాల క్లెయిమ్ లకు వెంటనే అర్హత రాదు. కొన్ని రకాల చికిత్సల కోసం కనీసం 24 నెలల వెయిటింగ్ పీరియిడ్, అప్పటికే ఉన్న వ్యాధులకు నాలుగేళ్ల వెయిటింగ్ పీరియడ్ అమల్లో ఉంది. పాలసీ తీసుకున్న నెల రోజుల తర్వాత నుంచి ప్రమాదాలు, వైరల్ జ్వరాలు, కామెర్లు తదితర ఊహించని వాటికే కవరేజీ ఉంటుంది. కానీ, అకో ప్లాటినం హెల్త్ ప్లాన్ లో ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ అమలు కాదు. పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే దేనికైనా క్లెయిమ్ చేసుకోవచ్చు.

రూ.5 లక్షలు లేదా రూ.10 లక్షలు ఇలా తీసుకున్న మొత్తంపై ఏటా 10 శాతం పెరుగుతూ వెళుతుంది. ద్రవ్యోల్బణ ప్రభావంతో ఏటేటా వైద్య ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా. అందుకని అకో ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. నో క్లెయిమ్ బోనస్ పేరుతో ఇతర కంపెనీలుు క్లెయిమ్ లేనప్పుడు సమ్ అష్యూరెన్స్ పెంచుతున్నాయి. కానీ అకో క్లెయిమ్ తో సంబంధం లేకుండా ఏటా 10 శాతం పెంచుతూ వెళుతుంది.

ఒక ఏడాదిలో ఏదైనా వైద్యం కోసం తీసుకున్న బీమా మొత్తం ఖర్చయిపోయింది అనుకుందాం. అప్పుడు అకో ప్లాటినం హెల్త్ ప్లాన్ లో తిరిగి అంతే మొత్తాన్ని రీస్టోర్ చేస్తారు. ఇలా ఒక ఏడాదిలో ఎన్ని సార్లు అయినా సమ్ అస్యూరెన్స్ రీస్టోరేషన్ సదుపాయం ఉంది. 7,100కు పైగా హాస్పిటల్స్ లో క్యాష్ లెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల్లో పారదర్శకత లేదని, అందుకే ఎలాంటి గందరగోళం లేకుండా అన్నింటికీ క్లెయిమ్ నిచ్చే ఈ ప్లాన్ తీసుకొచ్చామని సంస్థ సీఈవో సంజీవ్ శ్రీనివాసన్ తెలిపారు.

Also Read:  Artificial Intelligence: అసలుకు ఎసరు – AI మింగేసే జాబ్స్ ఇవే..

  Last Updated: 10 Mar 2023, 02:51 PM IST