Broken Mirror : ఇంట్లో పగిలిన అద్దం ఉండవచ్చా.. ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పగిలిన అద్దం (Broken Mirror) ఉండవచ్చా? ఒకవేళ అలా ఉంటే ఏం జరుగుతుంది?

Published By: HashtagU Telugu Desk
Do You Know What Happens If There Is A Broken Mirror In The House..

Do You Know What Happens If There Is A Broken Mirror In The House..

Broken Mirror in House : వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పగిలిన వస్తువులు పెట్టుకోకూడదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వాటిని చాదస్తం అని కొట్టి పారేస్తూ అలాంటి వస్తువులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో చాలామంది పగిలిన అద్దాన్ని (Broken Mirror) కూడా ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పగిలిన అద్దం (Broken Mirror) ఉండవచ్చా? ఒకవేళ అలా ఉంటే ఏం జరుగుతుంది? పగిలిన అద్దాన్ని ఉపయోగిస్తే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

మాములుగా వాస్తు ప్రకారం ఇంట్లో అద్దం పగిలితే చాలా అర్ధాలు ఉంటాయి. అద్దం పగలడం వల్ల ఇంటి కుటుంబసభ్యులకు పెద్ద సమస్య వచ్చి పడుతుంది. అలాగే ఇంట్లో ఏదైనా అద్దం పగిలితే రానున్న రోజుల్లో కష్టాలు ఎదురౌతాయట. కేవలం అద్దాలు మాత్రమే కాకుండా గాజు వస్తువులు పగలడం అన్నది కూడా వాస్తుశాస్త్రంలో శుభ, అశుభ పరిణామాలు చెప్పబడ్డాయి. ఇంట్లో అద్దం పగిలితే శుభం జరుగుతుందని అర్ధం. పొరపాటున అద్దం పగలగొడితే మీ ఇంట్లోంచి చెడు పోయి మంచి వస్తుందని అర్ధం. అయితే ఎక్కువ శాతం మంది అద్దాన్ని పగిలితే శుభప్రదంగా భావిస్తారు. కేవలం కొంతమంది మాత్రమే దాని అశుభంగా పరిగణిస్తారు. ఇలా అద్దం పగిలిపోవడం అన్నది రానున్న కాలంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడబోతున్నాయి అనడానికి సంకేతంగా భావించాలి. అదేవిధంగా ఇంట్లో ఒకవేళ కిటికీ లేదా గుమ్మం అద్దం పగిలితే లేదా బీటలు వారితే వాస్తు ప్రకారం అది అపశకునం కానేకాదు.

ఇంట్లో ఏదైనా శుభవార్త రావచ్చు లేదా చేతికి అందాల్సిన డబ్బు అందవచ్చు. ఉన్నఫలంగా అద్దం ఒక్కసారిగా పగిలిపోతే మనకు రావాల్సిన కష్టాలు తొలగిపోయినట్టే అని అర్థం. అయితే పగిలిన అద్దాన్ని (Broken Mirror) వెంటనే శుభ్రం చేసి బయట పాడేయాలి. వాస్తుశాస్త్రం ప్రకారం అద్దాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఇంట్లో గోళాకారం లేదా ఓవెల్ ఆకారంలో ఉండే అద్దం కొనుగోలు చేయకూడదు. ఈ విధమైన ఆకారం కలిగిన అద్దాలు ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని నెగెటివ్ ఎనర్జీగా మారుస్తాయి. అందుకే ఇంట్లో దీర్ఘ చతురస్రాకారపు అద్దాన్నే వినియోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read:  Visa Free Entry : డిసెంబరు 1 నుంచి వీసా లేకుండా ఈ దేశానికి వెళ్లిపోవచ్చు

  Last Updated: 27 Nov 2023, 03:31 PM IST