Lifestyle: పర్ఫ్యూమ్, డియోడ్రెంట్‌.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా?

ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి అనేక రకాల పర్ఫ్యూమ్ లు, డియోడ్రెంట్‌ లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే

  • Written By:
  • Publish Date - November 18, 2022 / 08:00 AM IST

ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి అనేక రకాల పర్ఫ్యూమ్ లు, డియోడ్రెంట్‌ లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మామూలుగా ఇవి రెండు కూడా శరీర దుర్వాసన కంట్రోల్ చేయడం కోసం ఉపయోగిస్తారు అన్న విషయం తెలిసిందే. యువత వీటిపట్ల ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీటిలో ప్రత్యేకంగా కలెక్షనన్స్ ను కూడా ఫాలో అవుతూ ఉంటారు. కాగా పర్ఫ్యూమ్‌, డియోడ్రెంట్‌ లు రెండూ దుర్వాసనను పోగొట్టేవే అయినప్పటిలి వీటి మధ్య తేడా ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే రెండింటి మధ్యలో ఉండే ప్రధాన వ్యత్యాసం పర్ఫ్యూమ్‌ ఎసెన్స్‌. దీనినే వాసన గాఢత అంటారు. సాధారణంగా పర్ఫ్యూమ్‌లలో 25 శాతం వరకు ఎసెన్స్‌ ఉంటే, డియోడ్రెంట్‌లలో ఇది 1 నుంచి 2 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి పర్ఫ్యూమ్‌ వాసన డియోడ్రెంట్‌ కంటే ఎక్కువగా ఉంటుంది. డియోడ్రంట్‌ లతో పోల్చితే పర్ఫ్యూమ్‌ల ప్రభావం ఎక్కువ సేపు ఉంటుంది. పర్ఫ్యూమ్‌ల సువానస సుమారు 12 గంటలు ఉంటుంది. డియోడ్రంట్‌లలో ఇది కేవలం 4 గంటలు మాత్రమే ఉంటుంది. అలాగే చెమటను పీల్చుకోవడంలో డియోడ్రంట్‌లు సమర్థవంతంగా పనిచేస్తాయి.

అలాగే ఇందులో ఉండే యాంటీ పెర్సిప్రెంట్‌ చెమటను పీల్చుకొని ఎప్పుడు తాజా అనుభూతిని కలిగిస్తుంది. కానీ పర్ఫ్యూమ్‌లో ఇలా ఉండదు. ఇదిలా ఉంటే పర్ఫ్యూమ్‌ ను చర్మంపై నేరుగా స్ప్రే చేయడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. కేవలం బట్టలకు మాత్రమే అప్లై చేసుకోవాలి. కానీ డియోడ్రంట్‌ మాత్రం చర్మంపై తక్కువ ప్రభావం చూపుతుంది.