Site icon HashtagU Telugu

Anant Ambani Weight : అనంత్ అంబానీ అంత బరువు పెరగడానికి కారణమేంటో తెలుసా ?

PM Modi Attend

PM Modi Attend

Anant Ambani Weight : అనంత్ అంబానీ – రాధికా మర్చంట్. ఇప్పుడు వీరిద్దరి వివాహమే హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజులుగా అందరూ వీరి వివాహం గురించే చర్చించుకుంటున్నారు. ఎంతపెద్ద సెలబ్రిటీ అయినా, వ్యాపారవేత్త అయినా.. ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోక తప్పదు. కానీ ఉన్నత కుటుంబాలకు చెందినవారు తమ జీవితభాగస్వామి తమకు సరిజోడి అయి ఉండాలని ఆరాటపడతారు. కానీ ఇక్కడ అనంత్ – రాధిక లను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఎవరికీ అనిపించదంటే తప్పు లేదు కదా. రాధికా మర్చంట్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె పక్కన అనంత్.. చాలా లావుగా కనిపిస్తున్నాడు. వీరిద్దరిదీ లవ్ మ్యారేజ్ అని తెలిసి అందరూ షాకయ్యారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ – నీతా అంబానీ దంపతుల చిన్న కొడుకు పెళ్లిని అంగరంగవైభవంగా జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 12న ఎన్ కోర్ హెల్త్ కేర్ సంస్థ సీఈఓ వీరెన్ మర్చంట్ – షైలా మర్చంట్ ఏకైక కుమార్తె రాధికా మర్చంట్ ను అనంత్ అంబానీ పెళ్లాడనున్నాడు. అంతకంటే ముందు వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుక జామ్ నగర్ లో జరగనుంది. మార్చి 1న అట్టహాసంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకకు సినీ, క్రీడ, రాజకీయ, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. అయితే.. అంత అందంగా ఉన్న రాధిక పక్క అనంత్ అలా కనిపించడానికి కారణమేంటి ? ఏ కారణం చేత అంత బరువు పెరిగాడో తెలుసుకుందాం.

అనంత్ అంబానీ.. 2013 సమయంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల్లో కనిపించాడు. అప్పట్లోనే చాలా లావుగా కనిపించాడు. 2016 సమయంలో చాలా సన్నంగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. 208 కిలోల బరువు నుంచి 100 కిలోలకు బరువు తగ్గాడు. రోజుకు ఐదారుగంటలు వ్యాయామం, 21 కిలోమీటర్ల నడక వంటి డైట్ పాటించారు. ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ వినోద్ చన్నా అనంత్ కు డైట్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత అనంత్ మళ్లీ బయటెక్కడా కనిపించలేదు. రాధికా మర్చంట్ తో రోకా సెర్మనీ, నిశ్చితార్థం సమయాల్లో కనిపించిన అనంత్ ను చూసి ఇంత లావున్నాడేంటని అంతా షాకయ్యారు. 2017లో బరువు తగ్గి కనిపించిన అనంత్ ను చూసి.. అబ్బా.. ఏమున్నాడు అనుకున్నవారంతా.. ఇప్పుడు ఏంట్రా ఇలా తయారయ్యాడని అనుకుంటున్నారు. యూఎస్ బ్రౌన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించిన అనంత్.. ప్రస్తుతం రిలయన్స్ న్యూ ఎనర్జీ బాధ్యతలను చూస్తున్నాడు.

అనంత్ అంబానీ ఇలా బరువు పెరగడానికి గల కారణాలను అతని తల్లి నీతా అంబానీ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. అనంత్ కు ఆస్తమా సమస్య ఉందని, దానికి స్టెరాయిడ్స్ ను ఎక్కువగా వాడాల్సి వచ్చిందన్నారు. వాటి ఎఫెక్ట్ తోనే అనంత్ అంత బరువు పెరుగుతున్నట్లు వివరించారు. అయితే తన కుమారుడిలా ఊబకాయంతో బాధపడుతున్న వారు సమాజంలో చాలా మంది ఉంటారని, అలాంటి వారిని చిన్నచూపు చూడొద్దని కోరారామె. ఆస్తమా సమస్య ఎక్కువగా ఉన్నవారికి ఆస్పత్రిలో చేరే అవసరం లేకుండా.. స్టెరాయిడ్స్ ను సజెస్ట్ చేస్తుంటారు వైద్యులు. ఇవి శ్వాసకోశాల్లో వాపును తగ్గిస్తుంది. కానీ విపరీతమైన ఆకలిని ప్రేరేపిస్తాయి. ఎక్కువగా తినడంతో పాటు.. శారీరక వ్యాయామాలు చేసేందుకు ఇబ్బందులు పడతారు. ఫలితంగా శారీరక బరువు పెరుగుతారు.

Also Read : Cancer Treatment: టాటా ఇన్‌స్టిట్యూట్ సంచలన విజయం.. రూ.100కే క్యాన్స‌ర్ టాబ్లెట్..!

 

Exit mobile version