Tibetan Singing Bowls : టిబెటన్ సింగింగ్ బౌల్స్ గురించి విన్నారా? అనేక ఆరోగ్య సమస్యలు తీరుస్తాయి..

టిబెటన్లు సింగింగ్ బౌల్స్ శబ్దాలను ఉపయోగించి కొన్ని రకాల అనారోగ్యాలకు చికిత్స చేస్తారు.

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 08:30 PM IST

Tibetan Singing Bowls : టిబెటన్లు సింగింగ్ బౌల్స్ ను ఉపయోగించి కొన్ని రకాల అనారోగ్యాలకు చికిత్స చేస్తారు. టిబెటన్ సింగింగ్ బౌల్స్ నుండి వచ్చే శబ్దాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. టిబెటన్ సింగింగ్ బౌల్స్ ను రాగి, జింక్, టిన్, ఇనుము, వెండి మరియు బంగారం వంటి లోహాలతో తయారుచేస్తారు. ఈ బౌల్స్ పైన చెక్కతో రుద్దితే మంచి శబ్దాలు వస్తాయి. ఈ గిన్నెలకు ఎన్నో ఏళ్ళ నాటి చరిత్ర ఉంది. ఒక్కో గిన్నెకు ఒక రకమైన ప్రకంపనం ఉందని నమ్ముతారు. ఈ ప్రకంపనాలు ద్వారా హీలింగ్ ఎనర్జీ విడుదల అవుతుంది. ఈ బౌల్స్ పైన చేసే శబ్దాలు వినడం వలన ఒత్తిడి తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది.

నిద్రలేమి సమస్య ఉన్నవారు సింగింగ్ బౌల్ శబ్దాలు వినడం వలన నిద్ర బాగా పడుతుంది. టిబెటన్లు సింగింగ్ బౌల్ శబ్దాలు పర్యావరణాన్ని శుద్ధి చేస్తాయని నమ్ముతారు. సింగింగ్ బౌల్స్ శబ్దాలు వినడం వలన ఒత్తిడికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. సింగింగ్ బౌల్స్ మీద చేసే శబ్దాలకు శిక్షణ అవసరం లేదు. బౌల్ ను చెక్కతో చేసిన వస్తువుతో స్మూత్ గా రుద్దడమే.

సింగింగ్ బౌల్స్ ఖరీదుతో కూడినవే. ఇవి ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. బౌల్స్ లో బుద్ధ బౌల్, హిమాలయన్ బౌల్, రిన్ గాంగ్, బౌల్ గాంగ్, కప్ గాంగ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటితో చేసే శబ్దాలను అందరూ వినకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు డాక్టర్లను సంప్రదించి వినాలి. ప్రస్తుతం కొన్ని ఏరియాలలో ఈ టిబెటన్ బౌల్స్ థెరపీని చికిత్స కింద అందిస్తున్నారు. మీరు కూడా ప్రశాంతత కోసం ఒకసారి ఈ టిబెటన్ బౌల్స్ థెరపీ ట్రై చేయండి.

 

Also Read : Summer Tips: వేసవిలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?