Site icon HashtagU Telugu

Fish Eyes Benefits : చేపకళ్లను పారేస్తున్నారా ? ఈ విషయాలు తెలిస్తే వదలకుండా తింటారు..

health benefits of fish eyes

health benefits of fish eyes

Fish Eyes Benefits : చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. వైద్యులు కూడా వారానికి కనీసం ఒకసారైనా తినాలని సూచిస్తుంటారు. కానీ.. తినాల్సింది చెరువులో చేపలు కాదు. సముద్రపు చేపలు తింటే గుండె సంబంధిత సమస్యలు రావని, ఈకో సపెంటానోయిక్ (ఈపీఏ), డొకోసాహెక్జానిక్ యాసిడ్ (డీహెచ్ఏ), మెరైనా ఒమెగా -3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తాయని చెబుతారు. సాలమన్, టూనా, సార్డైన్స్, మాకెరెల్ వంటి చేపలలో కొవ్వులు అధికం.. అందుకే వీటిని తరచూ తినాలని సూచిస్తుంటారు. చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్.. ఇతర ఆహారాల్లో ఉన్నప్పటికీ చేపలలో మాత్రం పుష్కలం.

అయితే కొందరు చేపల్లో కండ ఉన్న భాగాన్ని మాత్రమే తిని.. తల భాగాన్ని వదిలేస్తారు. ఎందుకంటే అందులో పనికొచ్చేవి ఏవీ ఉండవనేది వారి భావన. నిజానికి చేప తల, కళ్లలో చాలా పోషకాలుంటాయి. ముఖ్యంగా చేప కళ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.

కంటిచూపు సమస్య ఉన్నవారు చేపకళ్లు తింటే.. కంటి చూపు సమస్య తగ్గుతుంది. చేప శరీరం మొత్తం కంటే కంటి భాగంలో ఉండే ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటిచూపుకు మంచి చేస్తాయి.

అంతేకాదు ఆటిజం సమస్య ఉన్నవారికి కూడా చేపకళ్లను తినిపించాలి. ఆటిజం సమస్య ఉన్న వ్యక్తి చాలా ఆతృతగా ఉంటారు. త్వరగా అలసిపోతారు. ఎలాంటి విషయంపైనా ఆసక్తి ఉండదు. తరచూ చేప కళ్లు తింటే వాటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆటిజం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

గుండె ఆరోగ్యానికి చేప చాలామంచిది. రోజూ చేప కళ్లు తినేవారికి గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చేప కళ్లను క్రమం తప్పకుండా తినండి.

మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. భావోద్వేగాలు సమానంగా ఉంటాయి. షుగర్ వ్యాధి త్వరగా రాదు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి శరీరంలో ఇన్సులిన్ స్థాయిల్ని తగ్గిస్తుంది. టైప్ -1 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చేపకళ్లలో విటమిన్ డి పుష్కలం. ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది. సాల్మన్ చేపల్లో ఇది అధికంగా ఉంటుంది. చేపకళ్లు తినేవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ తెలిపింది. జీర్ణక్రియ, మౌత్ క్యాన్సర్, స్వరపేటిగ, పెద్దప్రేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది.

Also Read : Pooja: ఇంట్లో ప్రతిరోజు పూజలు చేస్తున్నారా.. అయితే ఈ ఫోటోలు అసలు ఉంచకండి!