Copper Sun : వాస్తు ప్రకారం ఇంట్లో రాగి సూర్యుడిని ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

వాస్తు ప్రకారం ఇంట్లో రాగిసూర్యుని (Copper Sun) పెట్టుకోవచ్చు లేదా ఒకవేళ పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Written By:
  • Updated On - January 3, 2024 / 02:03 PM IST

Vastu Tips for Placing Copper Sun in the House : మామూలుగా చాలామంది ఈ వాస్తు ప్రకారం ఇంట్లో రాగి సూర్యుడిని పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది రాగి సూర్యుని (Copper Sun) పెట్టుకోవచ్చా. పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అన్న సందేహా పడుతూ ఉంటారు.. మరి వాస్తు ప్రకారం ఇంట్లో రాగిసూర్యుని (Copper Sun) పెట్టుకోవచ్చు లేదా ఒకవేళ పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

రాగి సూర్యుడిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఇది దుష్టశక్తులను తొలగించే వాస్తు నివారణలలో ఒకటిగా పరిగణించవచ్చు. రాగితో చేసిన లోహ సూర్యుడిని అద్భుతమైన వాస్తు హార్మోనైజర్ గా భావిస్తారు. దీని నుంచి అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడిని నిత్యం పూజించడం ద్వారా జీవితంలో మెరుగైన ఫలితాలొస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం రాగి సూర్యుడిని ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. రాగి సూర్యుడు ఇంట్లో ఉంటే మంచిదే కదా అని ఏ దిశగా అంటే ఆ దిశగా ఉంచేయకూడదు. గోడలపై నిర్దిష్ట దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, రాగితో చేసిన సూర్యుడిని ఇంట్లో ఉంచడం వల్ల మీరు నివసించే ఇల్లు లేదా ఆఫీసులో మిగిలిన ప్రదేశాలలో కూడా మీకు తగిన గౌరవం లభిస్తుంది.

రాగి సూర్యుడు వల్ల ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాగి సూర్యుడికి బలమైన ఆకర్షణ శక్తి ఉందని, ఇది ప్రభావవంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను ఆకర్షిస్తుందని వాస్తు నిపుణులు అంటారు. మీ ఇంట్లో తూర్పు దిశలోని ఏదైనా మార్గంలో, తూర్పు గోడపై రాగి సూర్యుడిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల లోపాలన్నింటినీ అధిగమించవచ్చు. ఇది మీ ఇంటికి శ్రేయస్సును పెంచుతుంది. అలాగే ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉంటే తలుపు వెలుపల రాగి సూర్యుడిని ఉంచడం వల్ల మీ ఇంట్లో సంపద పెరిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఆఫీసులో తూర్పు గోడపై రాగి సూర్యుడిని వేలాడదీయడం వల్ల మీ కెరీర్లో పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు విజయం సాధిస్తారు.

సూర్య ఆరాధనతో సమస్త పాపాలూ నశించి, ఆరోగ్యం చేకూరుతుందనీ అనాదిగా వస్తున్న విశ్వాసం. ఆదిదేవుడైన సూర్యభగవానుణ్ణి నిష్టగా అర్చిస్తే, సర్వాభీష్టాలూ సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. సూర్యుడి రథానికి ఏడు అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు ఆరు ఋతువులు. ఏడు అశ్వాలు ఏడు కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి.

Also Read:  House : కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నారా..? అయితే ఈ 9 రకాల విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి..