Site icon HashtagU Telugu

Injection : ఇంజక్షన్ అంటే భయమా.. నొప్పి, సూది లేని ఇంజక్షన్ వచ్చేసింది..

Do You Know Needle Free Injection System

N Fis

Injection : ఇంజక్షన్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. జ్వరం వచ్చి తగ్గకుండా నాలుగు రోజులు అయినా కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే ఇంజక్షన్ వేస్తారనే భయం. ఇంజక్షన్ అంటే భయం ఉండడాన్ని ట్రీపనోఫోబియా అంటారు. పిల్లలు అయితే ఇంజక్షన్ అంటే చాలు ఏడుస్తూనే ఉంటారు. చిన్న పిల్లలకి టీకాలు వేసినప్పుడు కూడా పిల్లలు ఎక్కువగా ఏడుస్తారు.

ఇంజక్షన్ అంటే భయం ఉండేవారు ప్రపంచవ్యాప్తంగా 50 శాతం పిల్లలు, 30 శాతం పెద్దలు ఉన్నారట. అయితే వీరందరూ ఇప్పుడు ఇంజక్షన్ అంటే భయపడకుండా నొప్పి, సూది లేని ఇంజక్షన్ ని వేయించుకోవచ్చు.

ఇంటెగ్రి మెడికల్ అనే సంస్థ సూది లేని ఇంజెక్షన్ ని తయారుచేసింది. 2023 నుంచే ఈ సంస్థ ఈ ఇంజక్షన్స్ ని ఇస్తూ మరింత డెవలప్ చేస్తుంది. N – FIS (నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్ సిస్టం) అనే పేరుతో వీళ్ళు ఇంజెక్షన్ ని ఇస్తున్నారు. వేళ్ళు తయారుచేసిన సూది లేని ఇంజెక్షన్ తో కెమికల్ చాలా వేగంగా మన చర్మంలోని రంధ్రాల్లోనికి వెళ్తుంది. దీంతో మనకు ఎటువంటి నొప్పి లేకుండానే ఇంజక్షన్ వేయడం జరుగుతుంది.

ఇప్పుడు ఈ ఇంజక్షన్ ని ఆల్రెడీ మన దేశంలో కొంతమంది వైద్యులు వాడుతున్నారు. టీకాలు తయారుచేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తో తమ ఉత్పత్తిని వినియోగించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఇంటెగ్రి మెడికల్ సంస్థ తెలిపారు. కొన్ని రోజుల్లో అందరికీ సూది లేని ఇంజక్షన్ అందుబాటు లోకి వస్తుంది. దీంతో ఇంజక్షన్ అంటే భయం ఉన్నవారు ఇక భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు, పెద్దలు ఇంజక్షన్ ని ఆనందంగా వేయించుకోవచ్చు.

Also Read : Multani Mitti Vs Besan : ఎండాకాలంలో ముల్తానీ మట్టి వర్సెస్ శనగపిండి ఎవరు ఏది వాడాలి?