Site icon HashtagU Telugu

Bathukamma Special : నువ్వుల సద్ది ఎలా తయారు చేస్తారో తెలుసా..?

Nuvvula Saddi

Nuvvula Saddi

తెలంగాణలో బతుకమ్మ పండగా అంటే ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో బతుకమ్మను కోలుస్తారు తెలంగాణ ఆడపడుచులు. ఈ పండుగను అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి జరుపుకుంటారు ఎంగిలిపువ్వు బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తీరొక్క పువ్వు…తీరొక్క నైవేద్యంతో బతుకమ్మను పూజిస్తుంటారు. సద్దుల బతుకమ్మనాడు గౌరీదేవికి నైవేద్యంగా నువ్వుల సద్దిని పెట్టడం ఆనవాయితీ గా వస్తోంది. నువ్వుల పొడి, మసాలా దినుసులతో తయారు చేసే ఈ నువ్వుల సద్ధి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఈ సాంప్రదాయ వంటకం ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:
-4 కప్పుుల వండిన అన్న
-½ కప్పు నువ్వులు
-½ టీస్పూన్ మెంతి గింజలు
-2 టేబుల్ స్పూన్ల ధనియాలు
-5 ఎండు మిరపకాయలు
-3 టేబుల్ స్పూన్ల వంటనూనె
-1 టీస్పూన్ ఆవాలు
-1 టీస్పూన్ జీలకర్ర
-3 టేబుల్ స్పూన్ల శెనగలు
-4 మొత్తం ఎండు మిరపకాయలు
-1 కొమ్మ కరివేపాకు ఆకులు
-½ టీస్పూన్ పసుపు పొడి
తయారీ విధానం:

నువ్వులు, మెంతులు, ధనియాలను వేయించాలి. ఇప్పుడు ఒక పాన్ స్టవ్ పెట్టి .. అందులో ఒక టీస్పూన్ నూనె పోయాలి. అందులో ఎండు మిరపకాయను చిన్న ముక్కలుగా చేసి వేయించి పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత వీటన్నింటినీ పొడి చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి.. వేడెక్కిన తర్వాత నూనె పోసి.. జీలకర్ర, ఆవాలు, శెనగలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, వేయాలి. అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని వండిన అన్నాన్ని చల్లగా అయ్యేంత వరకు .. అందులో నువ్వుల పొడి ఉప్పు వేసి కలపండి. అంతే.. రుచికరమైన నువ్వుల సద్దీ రెడీ..!!