యాపిల్ టీ రోజూ తాగితే ఎంత మేలో తెలుసా?

ఆపిల్ టీ. తయారు చేయడం సులభం, తాగడానికి రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి అనేక విధాలుగా మేలు చేసే ఈ టీ ఇప్పుడు హెల్త్ లవర్స్‌లో మంచి ఆదరణ పొందుతోంది.

Published By: HashtagU Telugu Desk
Do you know how much you can get from drinking apple tea every day?

Do you know how much you can get from drinking apple tea every day?

. ఆపిల్ టీతో రోగనిరోధక శక్తి పెరుగుదల

. జీర్ణక్రియ, షుగర్ మరియు కొలెస్ట్రాల్ నియంత్రణ

. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డ్రింక్

. ఆపిల్ టీ తయారీ విధానం

Apple Tea: ఆపిల్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా మనం ఆపిల్స్‌ను నేరుగా తినడం, ఫ్రూట్ సలాడ్లు, కస్టర్డ్, పుడ్డింగ్‌లు, కేక్‌లలో ఉపయోగించడం చూస్తుంటాం. అయితే తాజాగా పోషకాహార నిపుణులు సూచిస్తున్న మరో ఆరోగ్యకరమైన రూపం ఆపిల్ టీ. తయారు చేయడం సులభం, తాగడానికి రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి అనేక విధాలుగా మేలు చేసే ఈ టీ ఇప్పుడు హెల్త్ లవర్స్‌లో మంచి ఆదరణ పొందుతోంది. ఆపిల్ టీ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తరచూ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి ఆపిల్ టీ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. రోజుకు ఒక కప్పు ఆపిల్ టీ తీసుకుంటే శరీరం లోపలి నుంచి బలంగా మారి, వైరల్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది.

అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆపిల్‌లో ఉండే మాలిక్ ఆమ్లం జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచుతుంది. ఆపిల్ టీ తాగడం వల్ల అజీర్తి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు వైద్యుల సూచనతో ఈ టీని పరిమితంగా తీసుకుంటే చక్కెర స్థాయిల్లో ఆకస్మిక మార్పులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక, అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి ఆపిల్ టీ మంచి సహాయకారి. ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఆపిల్ టీ లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు టీ లేదా కాఫీకి బదులుగా ఆపిల్ టీని ఎంపిక చేసుకోవచ్చు. ఇది మెటబాలిజాన్ని మెరుగుపరచి కొవ్వు పేరుకుపోకుండా సహాయపడుతుంది. అంతేకాదు ఆకలిని నియంత్రించి అనవసరమైన తినుబండారాలపై ఆసక్తిని తగ్గిస్తుంది. రోజువారీ జీవితంలో భాగంగా ఆపిల్ టీని అలవాటు చేసుకుంటే బరువు అదుపులో ఉండడమే కాకుండా శరీరం చురుకుగా ఉంటుంది. ఆపిల్ టీ తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక గిన్నెలో మూడు కప్పుల నీరు తీసుకుని మరిగించాలి. అందులో ఒక టీ బ్యాగ్ లేదా బ్లాక్ టీ ఆకులు వేసి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. నీరు మరిగిన తర్వాత తొక్కతో సహా చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆపిల్‌ను వేసి మరో ఐదు నిమిషాలు మరిగించాలి. చివరగా కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి వడకట్టి తాగాలి. ఈ విధంగా తయారుచేసిన ఆపిల్ టీని రోజూ తాగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

 

  Last Updated: 04 Jan 2026, 07:17 PM IST