Ayurveda Tips : మనం రోజూ ఇంట్లో తిన్నాక మిగిలే ఆహారాన్ని దాచుకొని.. మరుసటి రోజు తింటుంటాం. అయితే ఇలా మిగిలిపోయిన అన్నాన్ని, కూరలను ఎన్ని గంటల్లోగా తినాలి ? అనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. దీనికి ఆయుర్వేదం ఇస్తున్న సమాధానం ఏమిటంటే.. ఆహారం తాజాదనం, రుచి ఎప్పటివరకైతే మారకుండా ఉంటుందో అప్పటివరకు దాన్ని తినొచ్చు. ఒకవేళ తాజాదనం, రుచి కనిపించని స్థితిలోకి ఆహార పదార్థాలు మారిపోతే, వాటిని తినడం డేంజర్. అలాంటి ఫుడ్ తింటే ఆరోగ్య సమస్యలు ఆవరిస్తాయని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆయుర్వేదం చెబుతున్న టిప్స్
- సైన్స్ ప్రకారం.. ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని 15 సెకండ్ల పాటు అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే.. అందులోని వ్యాధికారక బ్యాక్టీరియా చనిపోతుంది. తాజాదనం కూడా మళ్లీ వచ్చేస్తుంది.
- ఆయుర్వేదం ప్రకారం.. వండిన ఆహారాన్ని 3 గంటల్లోగా తింటే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆ తర్వాతి నుంచి పోషక విలువలు క్రమంగా తగ్గుతాయి. రాత్రి సమయానికి ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్‌ను 24 గంటల్లోగా తినేయాలి. 24 గంటల తరువాత నిల్వ ఉన్న ఫుడ్ లో బ్యాక్టీరియా డెవలప్ అయ్యే ప్రక్రియ మొదలవుతుంది.ఈక్రమంలో వేడిచేసినా బ్యాక్టిరియా పోయే అవకాశం ఉండదు.
- మిగిలిపోయిన ఫుడ్‌ను ఎక్కువకాలం పాటు కంటిన్యూగా తింటే కడుపులోని పేగుల పనితీరు దెబ్బతింటుంది.
- ఫుడ్ పూర్తిగా చల్లారాకే ఫ్రిజ్ లో పెట్టాలి.
- మాంసం, పాలతో చేసిన వంటకాలను ఎక్కువకాలం నిల్వ చేయకుండా.. తాజాగా ఉన్నప్పుడే తినేయడం మంచిది.
ఉల్లిపాయ వేసిన కూరలు..
ప్రతి ఇంట్లో రోజూ రాత్రి సమయానికి కూరలు, పప్పులు మిగిలిపోతుంటాయి. వాటిని ఫ్రిజ్‌లో పెట్టి తినేవాళ్లు ఉంటారు. కాకపోతే వాటిని ఫ్రిజ్‌లో పెట్టేటప్పుడు గాలి చొరబడని కంటైనర్లలో పెట్టి దాచాలి. ఇలా నిల్వ ఉంచాలని భావించే కూరల్లో ఉల్లిపాయలు వేయకుండా వండితే మంచిది. ఉల్లిపాయ వేసిన కూరలు త్వరగా పాడవుతాయి. నీళ్లు లేకుండా వండిన వేపుళ్లు మరుసటి రోజు వరకు దాచుకొని, వేడి చేసుకొని తిన్నా ఏమీ కాదు. బ్రెడ్ విషయానికి వస్తే ఫ్రిజ్‌లో పెట్టి వారం రోజుల వరకు వాడుకోవచ్చు. హోం మేడ్ బ్రెడ్ అయితే మూడు నాలుగు రోజుల వరకు(Ayurveda Tips) వాడొచ్చు.
గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ, మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.