Site icon HashtagU Telugu

Chanakya Niti : ఏడ్చే మహిళలపై చాణక్యుడు ఏం చెప్పారో తెలుసా ?

Chanakya Niti

Chanakya Niti

Chanakya Niti : చాణక్యుడు వేల ఏళ్ల క్రితం చెప్పిన నీతి సూత్రాలను చాలామంది నేటికీ ఫాలో అవుతుంటారు. ఆయన పుస్తకాలను ఎంతోమంది నిత్యం చదువుతుంటారు. ఎలాంటి స్త్రీలను వివాహం చేసుకుంటే మంచిదనే విషయాన్ని కూడా చాణక్యుడు వివరించారు. ఆ వివరాలు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join.

ఎన్ని గొడవలు జరిగినా..

చాణక్యుడి ప్రకారం..  స్త్రీలు సున్నితంగా ఉంటారు. సున్నితంగా ఉండే స్త్రీలు ఎదుటి వారి భావాలను గౌరవిస్తారు. కుటుంబం మొత్తాన్ని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. సంతోషమైనా, విచారమైనా మొదట స్త్రీలు ఏడుస్తారు. అలాంటి స్త్రీలు చాలా మంచివారు. అలాంటి స్త్రీలను పెళ్లి చేసుకున్న వారు నిజంగానే అదృష్ట వంతులు.  ప్రతి చిన్న విషయానికి ఏడ్చే స్త్రీల మనసు బంగారం లాంటిది.  అలాంటి స్త్రీలను  గౌరవించాలి. ఇలాంటి స్త్రీల ఆలోచనలు సవ్యంగా ఉంటాయి.  ఎన్ని గొడవలు జరిగినా.. తాను ప్రేమించే భర్తే కావాలని అనుకుంటే అలాంటి స్త్రీలను అస్సలు వదిలిపెట్ట కూడదు. ఏడ్చే మహిళలు ఎవరినీ ఆకలితో ఉండనివ్వరు. ఇంటికి వచ్చిన వారిని ఆకలితో పంపించరు. వీరికి ఇలాంటి మంచి గుణం ఉంటుంది. ఇలాంటి స్త్రీల వల్ల పురుషులకు అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో వాళ్లతో, పొరుగు వారితో కలిసి పోయే స్త్రీలను పొందడం చాలా లక్. స్త్రీలు ఎక్కువగా కేకలు పెట్టడం, ఏడవడం వల్ల అనేక రకాల వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఇలాంటి లక్షణాలున్న మహిళలను పురుషులు కోల్పోకూడదు. స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కించ పరచకూడదని చాణక్య నీతి(Chanakya Niti) బోధిస్తోంది.

Also Read: Ayodhya – Tent City : అయోధ్యలో టెంట్ సిటీ రెడీ.. ‘నిషాద్‌రాజ్‌ అతిథి గృహ్‌’ పేరు వెనుక గొప్ప చరిత్ర!

పురుషుల కంటే అత్యాశ ఎక్కువే..

చాణక్య నీతి ప్రకారం స్త్రీలు పురుషుల కంటే అత్యాశ ఎక్కువ ఉంటుందని చాణక్యుడు తెలిపాడు. అది డబ్బు, నగలు, బట్టలు మొదలైనవి విషయాల్లో అయి ఉంటుంది. మనిషికి కోరిక ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. అది ఎప్పటికైనా డేంజర్. అతిగా అత్యాశతో ఉంటే మోక్షానికి అవకాశం లేదని చాణక్యుడు చెప్పాడు. దీనితో అనేక సమస్యలు వస్తాయి. జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. చాణక్యుడు ప్రకారం మహిళలు ఏదైనా పని చేసేటప్పుడు ఎక్కువగా ఆలోచించరు. ప్రతి పని చేసేటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయాలి. కొంచెం తడబడినా ప్రమాదంలో పడతారు. ఆలోచన లేకుండా చేసే పనులు విజయాన్ని ఇవ్వలేవు. ఆలోచిస్తేనే సరైనా అడుగులు పడతాయి. ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఆలోచన లేకుండా ముందుకు వెళ్తే సమస్యలు కచ్చితంగా వస్తాయి. వాటిని ఎదుర్కొనేందుకైనా సరిగా ముందుగు సాగాలి.స్త్రీలలో కొందరు చాలా స్వార్థపరులు. మహిళలు తమ పనిని పూర్తి చేయడం కోసం దేనికైనా సిద్ధపడతారు. ఈ గుణం కొందరికి ఉంటుంది. స్త్రీలు ఈ లక్షణాలను విడిచిపెట్టాలని చాణక్యుడు చెప్పాడు. జీవితంలో కొన్ని విషయాలు జరిగితే జరుగుతాయి.. లేదంటే లేదు. దానికోసం కొన్ని కోల్పోవలసిన అవసరం లేదు. అలా చేస్తే మిమ్మల్ని చూసి ఇతరులు చెడుగా మాట్లాడే అవకాశం ఉంది.