Danger: చీకట్లో టీవీ,సెల్ ఫోన్ చూసే అలవాటు ఉందా..? అయితే ఈ జబ్బులు గ్యారెంటీ..!!

కొంతమంది రాత్రిళ్లు అస్సలు నిద్రపోరు. మధ్యరాత్రివరకు టీవీ చూస్తూ...ఫోన్ చూస్తూ గడుపుతుంటారు. దుప్పట్లో ఫోన్ చూస్తూ...చీకట్లో టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు.

  • Written By:
  • Publish Date - June 10, 2022 / 10:30 AM IST

కొంతమంది రాత్రిళ్లు అస్సలు నిద్రపోరు. మధ్యరాత్రివరకు టీవీ చూస్తూ…ఫోన్ చూస్తూ గడుపుతుంటారు. దుప్పట్లో ఫోన్ చూస్తూ…చీకట్లో టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఇవి నేటి తరానికి బాగా అలవాటయ్యాయి. మీరు కూడా అదే చేస్తుంటే మానుకోండి. ఎందుకంటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా.

కొందరికి ఏం చేయాలో తెలియదు.సమయాన్ని గడిపేందుకు టీవీ చూస్తుంటారు. మరీ ముఖ్యంగా నేటి యువతలో ఈ అలవాటు ఎక్కువగాఉంది. మొబైల్స్ లో స్క్రోలింగ్ చేస్తూ కూర్చుంటారు. పగలు కంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా ఇలా చేస్తుంటారు. అయితే చీకట్లు టీవీ, ఫోన్ స్క్రీన్ చూడటం మీ కంటికి అస్సలు మంచిది కాదు. క్రమంతప్పకుండా దగ్గరి నుంచి టీవీ చూడటం కంటి సమస్యలకు దారితీస్తుందని అందరికీ తెలుసు. అయితే చీకట్లు టీవీ చూస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు ఒకేలా ఉండవు. ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

కంటి చూపును తగ్గిస్తుంది.
చీకట్లు కూర్చుని టీవీ చూస్తే…కంటి చూపు తగ్గుతుంది. చీకటి గదిలో కూర్చుని టీవీ చూస్తున్నప్పుడు మీ కళ్లు ఎప్పుడూ పలు రకాల కాంతికి అనుగుణంగా ఉండాలి. ఎందుకంటే టీవీలో విజువల్స్ మారే కొద్దీ లైట్ కాంపోజిషన్ అనేది తగ్గుతుంది. స్క్రీన్ పై సీన్ మారిన ప్రతిసారీ లేదా టెలివిజన్ కార్యక్రమం మారిన ప్రతిసారీ.. స్క్రీన్ నుంచి వెలువడే లైటింగ్ లో చాలా పెద్ద మార్పు ఉంటుంది.

డ్రై ఐ సిండ్రోమ్ వ్యాధి:
నిరంతరం మారుతున్న లైటింగ్ లెవల్స్ అనేవి మీ కళ్ళపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. కంటి అలసటకు దారితీస్తుంది. డ్రై సిండ్రోమ్ కు దారితీస్తుంది, ఇది గ్లకోమా ప్రమాదాన్ని పెంచే కారకం కూడా.

కంటిలోని రెటీనాకు నష్టం:
టీవీ నుంచి వెలువడే లైటింగ్ లో అతినీలలోహిత కిరణాలు కొద్ది మొత్తంలో ఉంటాయి. కంటిలోని రెటీనాను దెబ్బతీస్తాయి. గదిలో వెలుతురు ఉంటే అతినీలలోహిత కిరణాలు, కాంతి కిరణాలను కలిసి అవి కంటిపై పడతాయి. దీంతో రెటీనా దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది.

అందుకే రాత్రిపూట టీవీ చూస్తున్నప్పుడు గదిలో లైట్ ను ఆఫ్ చేయకూడదు. టీవీకి కనీసం ఐదు అడుగుల దూరంలో ఉండాలి. టీవీలో బొమ్మలు కనిపించే స్క్రీన్ ఒక మూల నుంచి దానికి ఎదురుగా ఉన్న మూలకు అంటే కర్ణం వెనుక ఉండే దూరాన్ని ఆ టీవీ సైజుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ఆ సైజును 4తో భాగించినట్లయితే, ఆ టీవీ నుంచి మనం ఎన్ని అడుగుల దూరంలో కూర్చోవాలనేది ఆ నెంబరు మనకు తెలుపుతుంది.

ఈ జబ్బులు వస్తాయి..
టీవీ ఎక్కువ సేపు చూస్తే కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే దీన్ని తాత్కాలికమైన సమస్యగా భావించి లైట్ తీసుకుంటారు. కొంతసేపు రెస్ట్ తీసుకుంటే ఈ సమస్క తగ్గినట్టుగా అనిపించినా.. రాబోయే రోజుల్లో ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యకు దారితీస్తుంది. కంటి అలసట గ్లాకోమా, ఆస్టిగ్మాటిజం తో ఇది ముడిపడి ఉంది. కళ్ల నుంచి నీరు కారడం, కళ్లు మండడం, తలనొప్పి, దృష్టి మసకబారడ వంటి కొన్ని సమస్యలు కూడా తలెత్తుతాయి.