Site icon HashtagU Telugu

Refrigerator : రిఫ్రిజిరేటర్ ని 24 గంటలు ఆన్ లో ఉంచుతున్నారా?

Do you keep your refrigerator on 24 hours in day

Fridge

Refrigerator : ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రిఫ్రిజిరేటర్ ను ఎక్కువగా వాడతారు. అయితే చాలా మంది ఎక్కువగా వాడడం వలన కూలింగ్ గా ఉండడానికి ఎప్పుడూ ఆన్ లోనే ఉంచుతాము. కానీ ఫ్రిడ్జ్ అనేది 24 గంటలు ఆన్ లో ఉండకూడదు.

ఎండాకాలంలో ఎక్కువగా వాడినా దానికి కొంత సమయం విశ్రాంతి అనేది ఇవ్వాలి. లేకపోతే అది తొందరగా రిపేర్ వచ్చే అవకాశం ఉంది. ఎండాకాలంలో నిరంతరం రిఫ్రిజిరేటర్ ఆన్ చేసి ఉంచడం వలన కరెంటు బిల్ కూడా ఎక్కువగా వస్తుంది.

రోజులో రెండు మూడు సార్లు రిఫ్రిజిరేటర్ ని ఆఫ్ చేయాలి కనీసం రెండు గంటలు అయినా ఆఫ్ చేయాలి. అప్పుడే యంత్రానికి కూడా విశ్రాంతి అనేది దొరుకుతుంది. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు లేదా ఊరు వెళ్ళినప్పుడు రిఫ్రిజిరేటర్ ను ఆఫ్ చేసి వెళ్ళాలి. రిఫ్రిజిరేటర్ ను ఆఫ్ చేయకుండా బయటకు వెళ్ళకూడదు. మీరు రాత్రి పూట లేట్ గా పడుకుంటే రిఫ్రిజిరేటర్ ని ఆఫ్ చేసి పడుకోండి. మళ్ళీ ఉదయమే ఆన్ చేసుకోవచ్చు.

ఫ్రిడ్జ్ రెగ్యులర్ గా 24 గంటలు ఆన్ లో ఉంచితే త్వరగా రిపేర్ కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మనిషి అయినా యంత్రం అయినా కాస్త రెస్ట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు స్మార్ట్ రిఫ్రిజిరేటర్ లు వస్తున్నాయి అవి కూల్ ఎక్కువ అయితే వాటంతట అవే ఆఫ్ అయిపోతాయి. కూలింగ్ మొత్తం పోయింది అనుకుంటే, బయట వేడి ఎక్కువగా ఉందంటే వాటంతట అవే ఆన్ అవుతాయి. ఇలాంటి రిఫ్రిజిరేటర్ లు వాడే వారు రిఫ్రిజిరేటర్ ను ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మనం బిజీగా ఉంటాము అనుకుంటే ఇలాంటి రిఫ్రిజిరేటర్ ను కొనుక్కోవడం మంచిది.

Also Read : Injection : ఇంజక్షన్ అంటే భయమా.. నొప్పి, సూది లేని ఇంజక్షన్ వచ్చేసింది..