white spots: మీ గోళ్లపై తెల్లటి మచ్చలు వచ్చాయా ?

  • Written By:
  • Publish Date - January 20, 2023 / 09:00 PM IST

వీటిని కాల్షియం లోపానికి సంకేతంగా భావిస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ తెల్లటి మచ్చలు కాల్షియం లోపం వల్ల కాదు, జింక్ లోపం వల్ల వస్తాయి . జింక్ సప్లిమెంట్స్ ను, జింక్ ఉండే ఫుడ్స్ ను తింటే.. గోళ్లపై తెల్లటి మచ్చలు రావని నిపుణులు చెబుతున్నారు.

జింక్ అనేది మన శరీరంలో ఇనుము తర్వాత రెండో అత్యంత సమృద్ధిగా లభించే ట్రేస్ మినరల్. ప్రోటీన్ ఉత్పత్తి, కణాల పెరుగుదల, విభజన, DNA సంశ్లేషణ, రోగనిరోధక శక్తిని నిర్వహించడం,ఎంజైమ్ ప్రతిచర్యలు వంటి వివిధ శారీరక విధులకు జింక్ చాలా ముఖ్యం. “73 శాతం భారతీయుల్లో ప్రోటీన్ పోషకాహార లోపం ఉంది.. జింక్ లోపం అయితే మరింత ఎక్కువగా ఉంది” అని ఒక పోషకాహారా నిపుణుడు తెలిపారు.

* జింక్ లోపం సంకేతాలు

● మీరు ఎక్కువసేపు నిద్రపోరు.
● మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది.
● మీలో సెక్స్ డ్రైవ్ లేదా మూడ్ తక్కువగా ఉంటుంది.
●మీరు సులభంగా బరువు పెరుగుతారు.
● మీ దంతాలు పుచ్చిపోయి  చిగుళ్లలో రక్తస్రావం జరుగుతుంది.

* జింక్ సమృద్ధిగా ఉండే ఆహారాలు

ఓస్టెర్ క్రాబ్, ఎండ్రకాయల  మాంసం, పౌల్ట్రీ, కూరగాయలు, పుట్టగొడుగులు, బచ్చలికూర, బ్రోకలీ, వెల్లుల్లి, కాలే చిక్కుళ్ళు చిక్‌పీస్ , బీన్స్ , బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా, తృణధాన్యాలు, కార్న్‌ఫ్లేక్స్,డార్క్ చాక్లెట్, గుమ్మడికాయ ఈ లిస్టులో ఉన్నాయి.

* జింక్ సప్లిమెంట్లను తీసుకోవచ్చా?

జింక్ లోపాన్ని అధిగమించడానికి జింక్ సప్లిమెంట్లను ఆహారంలో చేర్చవచ్చు. జింక్ గ్లూకోనేట్, జింక్ సల్ఫేట్, జింక్ సిట్రేట్ మొదలైన వివిధ రకాల జింక్ సప్లిమెంట్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే వీటిని తీసుకోవాలి. అయితే అవి కొంతమందిలో వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి ప్రతికూల దుష్ప్రభావాలు కలిగిస్తాయి.