Site icon HashtagU Telugu

Tomato : క్షణాల్లో చర్మం మెరిసిపోవాలంటే టమాటాతో ఇలా చేయాల్సిందే?

Refrigerate Tomatoes

Do You Have To Do This With Tomato To Get Glowing Skin In Seconds..

Tomato Benefits : చాలామంది ఈ ముఖం అందంగా కనిపించడం కోసం రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. అయినా కూడా ముఖం అందంగా కనిపించడం లేదు అనే బ్యూటీ పార్లర్లకు వెళ్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం కేవలం ఇంట్లో దొరికే కొన్ని రకాల వస్తువులను ఉపయోగించి మెరిసే అందాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. కొన్ని వంటింటి చిట్కాలను ఉపయోగించడం వల్ల ఎటువంటి బ్యూటీ ప్రోడక్టులు ఉపయోగించకుండానే ఎంతో అందంగా కనిపించవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

చర్మాన్ని కాపాడడంలో టమాట (tomato), పసుపు రెండు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఈ రెండు విడివిడిగా మాత్రమే కాకుండా కలిపి వాడడం వల్ల కూడా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. వీటిని కలిపి అప్లై చేయడం వల్ల చక్కని మెరుపు మీ సొంతమవుతుంది. ఇందుకోసం బాగా పండిన టమాటా (tomato)ను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. అలా తయారైన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. ముఖానికి పట్టించేటప్పుడు కంటి దగ్గర చేయకపోవడం మంచిది. ఆ మిశ్రమం పట్టించుకున్న తర్వాత కొద్దిసేపు ఆగి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఆపై మాయిశ్చరైజర్‌ని అప్లై చేయాలి. ఇలా తరచుగా చేస్తూ ఉండటం వల్ల మెడిసి చర్మం మీ సొంతం అవుతుంది.

అయితే, ఈ ప్యాక్ అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ఆ మిశ్రమంపై మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ముందుగా మీ చేతిపై అప్లై చేసుకొని మంచి రిజల్ట్ కనిపించిన తర్వాత ముఖానికి అప్లై చేయడం మంచిది. మామూలుగా స్త్రీలు ముఖానికి స్నానం చేసేటప్పుడు పసుపు పట్టించుకుంటూ ఉంటారు. ముఖానికి పసుపు పట్టించుకోవడం వల్ల ముఖంలో గ్లో కనిపిస్తుంది. అలాగే టమోటా పండును కూడా అందానికి ఎంతో బాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఒక టమాటా (tomato)న్ని తీసుకొని దానిని సగానికి కోసి చేసి కొద్దిగా చక్కెర అద్దుకొని ముఖానికి పట్టించుకోవడం వల్ల చర్మం పై ఉన్న మృతకణాలు దుమ్ము,దూళి వంటివి తొలగిపోతాయి.

Also Read:  Gifts : అలాంటి వస్తువులు బహుమతిగా ఇస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?