Site icon HashtagU Telugu

Bad Smell From Mouth: మీకు నోటి దుర్వాసన బాగా వస్తుందా.. ఇలా తొలగించుకోండి

Bad Smell From Moth

Bad Smell From Moth

నోటి దుర్వాసన (Bad Smell) ఎన్నో కారణాలు!

నోటి దుర్వాసన (Bad Smell) వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. ఇందులో ఒకటి డ్రై మౌత్. అంటే నోరు ఎండిపోవడం. కొన్ని రకాల ఔషధాలు తీసుకునేవారు, పొగతాగే అలవాటు ఉన్నవారిలో నోరు ఎండిపోయి దుర్వాసనకు కారణమవుతుంది. శుభ్రత లోపించడం మరో కారణం. నోటి దుర్వాసన వెనుక ఉండే కారణం ఇదే. తిన్న ఆహార పదార్థాలు పళ్లల్లో చిక్కుకుని, అవి పాడయ్యి దుర్వాసన వెలువడుతుంది.

గ్యాస్ట్రో ఇంటెస్టినల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్ డీ) అనేది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్య. తిన్న ఆహారాన్ని విచ్చిన్నం చేసి జీర్ణమయ్యేందుకు జీర్ణరసాలు విడుదల అవుతుంటాయి. ఈ రసాలు తిరిగి అన్నవాహిక పైపులోకి రావడమే చిగుళ్ల సమస్యల్లోనూ నోటి దుర్వాసన (Bad Smell) వస్తుంటుంది. చిగుళ్లు నుంచి రక్తం కారుతున్నా, చిగుళ్ల వాపు కనిపించినా నోటి దుర్వాసన మౌత్ కేన్సర్ (ముక్కు, నోటి మధ్య భాగంలో కేన్సర్) ఉన్న వారిలోనూ దుర్వాసన వస్తుంది. అలాగే, మధుమేహం, ముక్కులో ఇన్ఫెక్షన్, గొంతులో ఇన్ఫెక్షన్ కూడా దీనికి కారణమవుతాయి.

పరిష్కార మార్గాలు ..!

జీఈఆర్డీ, కేన్సర్, చిగుళ్ల సమస్యలు వస్తే వైద్యులను సంప్రదించాలి. ఇతర సమస్య వల్ల అయితే వాటికీ పరిష్కార మార్గాలు ఉన్నాయి. పెరుగుతో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. నోటి నుంచి దుర్వాసన వచ్చే వారు పెరుగును తినాలి. అప్పుడు పెరుగులోని మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. లవంగం నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండడం మంచి ఫలితాన్నిస్తుంది. పంటి నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

అలాగే, సోంపు కూడా దుర్వాసనను పోగొడుతుంది. నీటిలో కొంత సోంపు వేసి కాచి, గోరు వెచ్చగా మారిన తర్వాత ఆ నీటితో పుక్కిలించడం కూడా ఫలితమిస్తుంది. తమలపాకులు నమలడం ద్వారా దుర్వాసన పోతుంది. తులసిలోనూ మంచి ఔషధ గుణాలున్నాయి. తులసి ఆకులను పుక్కిట పెట్టుకుని కొంచెం కొంచెం నములుతూ విడుదలయ్యే రసాన్ని గార్గిల్ చేసి మింగేయాలి. ఆహారం తీసుకున్న వెంటనే బ్రష్ చేసుకోవాలి. దీనివల్ల పళ్ల మధ్యలో ఆహారం ఇరుక్కుంటే పోతుంది. పొగాకు నమిలే అలవాటు, చూయింగ్ గమ్ అలవాట్లను విడిచిపెట్టాలి.

Also Read:  Twitter CEO: ట్విట్టర్​ సీఈఓగా మస్క్ పెంపుడు కుక్క